Anant Radhika Wedding: వియ్యంకుల ఆస్తి చాలా త‌క్కువ‌..!

Anant Radhika Wedding: రిల‌య‌న్స్ సంస్థ‌ల అధినేత ముఖేష్ (Mukesh Ambani) అంబానీ ఆస్తుల విలువ ఎంత‌కాద‌న్నా రూ.11,500 కోట్లు ఉంటుంది. భార‌త‌దేశంలోని అత్యంత ధ‌నికుల్లో ముఖేష్ అంబానీ ఒక‌రు. ఇక ఆయ‌న‌కు కాబోయే వియ్యంకులు అంటే ఇంచు మించు త‌మ‌కు స‌మానంగా ఆస్తి ఉన్న‌వారు అయివుంటారు. లేదా త‌మ‌కంటే ఎక్కువ ఆస్తి ఉన్నార‌న్నా అయివుంటారు. ముఖేష్, నీతా అంబానీల చిన్న కుమారుడు అనంత్ అంబానీ.. (Anant Ambani) ఎన్‌కోర్ హెల్త్ గ్రూప్‌ల (Encore Health Care) అధినేత విరేన్ మ‌ర్చెంట్ కుమార్తె రాధిక మ‌ర్చెంట్‌ను (Radhika merchant) వివాహం చేసుకోబోతున్న సంగ‌తి తెలిసిందే.

ALSO READ: Anant Radhika Wedding: అత్యంత ఖ‌రీదైన కానుక ఎవ‌రిచ్చారో తెలుసా?

అయితే విరేన్ మ‌ర్చెంట్ ఆస్తి విలువ ముఖేష్ ఆస్తి విలువ‌తో పోల్చుకుంటే చాలా అంటే చాలా త‌క్కువ‌. విరేన్ మర్చెంట్ ఆస్తి విలువ రూ.700 కోట్లు మాత్ర‌మే. మొన్న గుజ‌రాత్‌లోని జామ్ న‌గ‌ర్‌లో జ‌రిగిన అనంత్ అంబానీ రాధిక మ‌ర్చెంట్‌ల ప్రీ వెడ్డింగ్‌కి అంబానీల‌కు అయిన ఖ‌ర్చు రూ.1200 కోట్లు. దీనిని బ‌ట్టే అర్థ‌మ‌వుతోంది విరేన్ మ‌ర్చెంట్ ఆస్తి ప‌రంగా ఎంత త‌క్కువో. అయినా ఎందుకు వారితో సంబంధం క‌లుపుకున్నారంటే.. అనంత్, రాధిక చిన్న‌ప్ప‌టి నుంచి మంచి స్నేహితులు. అంతే కాదు ప్రేమించుకున్నారు. పైగా అనంత్‌కు ఊబ‌కాయంతో బాధ‌ప‌డుతున్నాడు. ఎంత డ‌బ్బు ఉన్న‌ప్ప‌టికీ అనంత్‌ను వివాహం చేసుకునే అమ్మాయిల‌ను బ‌య‌టి నుంచి తీసుకురావ‌డం ముఖేష్ దంప‌తుల‌కు స‌వాల్‌తో కూడుకున్న ప‌ని. అందుకే త‌క్కువ ఆస్తి ప‌రులైనా కూడా విరేన్ మ‌ర్చెంట్‌తో సంబంధం క‌లుపుకున్నార‌ని టాక్.