Qatar: భారతీయుల‌కు మ‌ర‌ణ‌శిక్ష‌.. మ‌న అప్పీల్‌ను స్వీక‌రించిన ఖ‌తార్

ఖ‌తార్‌లో (qatar) గూఢ‌చ‌ర్యం చేస్తున్నార‌న్న ఆరోప‌ణ‌ల‌పై భార‌త‌దేశానికి చెందిన 8 మంది నేవీ అధికారుల‌కు (indian navy officers) ఆ దేశం మ‌ర‌ణ శిక్ష విధించిన సంగ‌తి తెలిసిందే. ఈ నేప‌థ్యంలో మ‌ర‌ణ శిక్ష‌ను నిలిపివేసేలా కేంద్ర ప్ర‌భుత్వం ఖ‌తార్ కోర్టులో అప్పీల్‌కు ద‌ర‌ఖాస్తు చేసింది. ఆ అప్పీల్‌ను ఖ‌తార్ న్యాయ‌స్థానం స్వీక‌రించింది. ఇది కాస్త ఊర‌ట క‌లిగించే విష‌యం అనే చెప్పాలి. ఈ అప్పీల్‌పై మ‌న వైపు నుంచి వాదోప‌వాదాలు ఎంత స్ట్రాంగ్‌గా ఉంటే ఖ‌తార్ న్యాయ‌స్థానం క‌నీసం మ‌న అధికారుల‌కు మ‌ర‌ణ శిక్ష ప‌డ‌కుండా నిలిపే ఛాన్స్ అంత గ‌ట్టిగా ఉంటుంది. వారిని మొత్తానికే వ‌దిలేయాల‌ని కూడా మ‌న దేశం ఖతార్‌ను కోర‌లేదు. క‌నీసం మ‌ర‌ణ శిక్ష ప‌డ‌కుండా చేస్తే చాలు అని వేడుకుంటోంది.