Jagadish: ఆ యువ‌తి “పుష్ప” న‌టుడి వ‌ల్లే ఆత్మ‌హ‌త్య చేసుకుందా?

Jagadish: అల్లు అర్జున్ న‌టించిన పుష్ప (pushpa) సినిమాలో కేశ‌వ పాత్ర‌లో న‌టించి అంద‌రినీ ఆకట్టుకున్న న‌టుడు జ‌గ‌దీష్ పంజాగుట్ట పోలీసుల అదుపులో ఉన్నారు. చిత్ర ప‌రిశ్ర‌మ‌లో జూనియ‌ర్ ఆర్టిస్ట్‌గా ప‌నిచేస్తున్న ఓ యువ‌తి పంజాగుట్ట‌లోని ఓ గ‌ది అద్దెకు తీసుకుని ఉంటోంది. ఈమె మ‌రో వ్య‌క్తితో స‌న్నిహితంగా ఉన్న‌ప్పుడు జ‌గ‌దీష్ ర‌హ‌స్యంగా ఫోటోలు తీసాడ‌ట‌. అంత‌టితో ఆగ‌కుండా ఆమెను ప‌లుమార్లు బెదిరించాడు. జ‌గ‌దీష్ బెదిరింపుల‌ను తాళ‌లేక గ‌త నెల‌లో ఆ యువ‌తి ఆత్మ‌హ‌త్య చేసుకుంది. ఆ కేసులో భాగంగా పోలీసులు జ‌గ‌దీష్‌ను అరెస్ట్ చేసారు.