Prithvi Shaw: ఒంట‌రిగా ఉండాల‌నిపిస్తోంది

Hyderabad: బ‌య‌టికి వెళ్లాలంటే భ‌యంగా ఉంద‌ని, ఇంట్లోనే ఒంట‌రిగా ఉండాల‌నిపిస్తోందని అంటున్నాడు క్రికెట‌ర్ పృథ్వీ షా (prithvi shaw). మొన్న జ‌రిగిన IPL సీజ‌న్‌లో పృథ్వీ ఫాంలో లేడు. దాంతో అత‌ను ఇండియ‌న్ టీంకు ఎంపిక కాలేక‌పోతున్నాడు. ఎలాగైనా టీం ఇండియాలో చోటు ద‌క్కించుకోవాల‌ని క‌ష్ట‌ప‌డుతున్న పృథ్వీకి (prithvi shaw) ఇటీవ‌ల ఓ షాకింగ్ ఎక్స్‌పీరియ‌న్స్ అయింది. ఓ మోడ‌ల్ పృథ్వీపై మీటూ కేసు పెట్టింది.

అదృష్టం బాగుండి పృథ్వీ త‌ప్పు లేద‌ని తెలిసి కోర్టు కేసు కొట్టేసింది. అయితే దీని వ‌ల్ల పృథ్వీ ల‌వ్ లైఫ్‌లో ప్రాబ్ల‌మ్స్ వ‌చ్చిన‌ట్లు తెలుస్తోంది. అత‌ని గర్ల్‌ఫ్రెండ్ నిధి త‌పాడియా బ్రేక‌ప్ చెప్పిన‌ట్లు టాక్. వీట‌న్నిటితో పృథ్వీ మాన‌సికంగా డిస్ట‌ర్బ్ అయ్యాడు. అందుకే న‌లుగురితో త‌న మ‌న‌సులో మాట చెప్పాలంటే మ‌రుస‌టి రోజే అది సోష‌ల్ మీడియాలోకి వ‌చ్చేస్తోంద‌ని, బ‌య‌టికి వెళ్లాలంటే భ‌య‌మేస్తోంద‌ని అంటున్నాడు.

న‌న్ను ఇండియ‌న్ టీం నుంచి తీసేసిన‌ప్పుడు ఎక్క‌డ త‌ప్పు జ‌రిగిందా అని ఆలోచించాను. చాలా మంది ఫిట్‌నెస్ వ‌ల్ల అయ్యి ఉంటుంద‌ని అన్నారు. అప్ప‌టికీ నేను బెంగ‌ళూరు వెళ్లి ఎన్సీఏలో అన్ని టెస్టుల్లో పాల్గొని పాస‌య్యా. అయినా కూడా నాకు వెస్ట్ ఇండీస్‌తో ఆడే ఛాన్స్ రాలేదు. చాలా బాధ‌ప‌డ్డాను. ఏం చేస్తాం. ఎవ‌రితో గొడ‌వ‌ప‌డ‌గ‌లం. అందుకే మూవ్ ఆన్ అవ్వాల‌ని నిర్ణ‌యించుకున్నాను. ఇండియా త‌ర‌ఫున ఓ 14 ఏళ్ల పాటు ఆడాల‌ని ఉంది. అదే నాకున్న గోల్. ఇండియా కోసం ఆడి ఇంటికి వ‌ర‌ల్డ్ క‌ప్ తేవాల‌ని అనుకుంటున్నా. దాని కోసం నేను బాగా క‌ష్ట‌ప‌డి ర‌న్స్ స్కోర్ చేయాలి అని తెలిపాడు షా. (prithvi shaw)