Viral News: క్లాస్ ఎగ్గొట్టి స్కూల్లో ప్రిన్సిప‌ల్ ఫేషియ‌ల్‌

Viral News: ఓ ప్రిన్సిప‌ల్ పిల్ల‌ల్ని తీసుకోవాల్సిన క్లాస్ ఎగ్గొట్టి స్కూల్లోనే ఫేషియ‌ల్ చేయించుకున్న ఘ‌ట‌న ఉత్త‌ర్‌ప్ర‌దేశ్‌లోని ఉన్నావ్‌లో చోటుచేసుకుంది. స్థానిక దాదామౌ ప్రైమ‌రీ పాఠ‌శాల‌లో ప్ర‌న్సిప‌ల్‌గా ప‌నిచేస్తున్న సంగీతా సింగ్ అనే మ‌హిళ నిన్న పిల్ల‌ల‌కి క్లాస్ తీసుకోవాల్సి ఉంది. కానీ ఆమె క్లాస్ ఎగ్గొట్ట‌డ‌మే కాకుండా త‌న క్యాబిన్‌కి పార్ల‌ర్ వారిని పిలిపించుకుని ఫేషియ‌ల్ చేయించుకుంది. అదే స‌మ‌యంలో అన‌మ్ ఖాన్ అనే టీచ‌ర్ ఈ తతంగాన్ని మొత్తం వీడియో తీసింది. అది గ‌మనించిన సంగీతా సింగ్ రెచ్చిపోయింది. అన‌మ్‌పై చేయిచేసుకుంది. ఇటుక రాయితో కొట్టి చేతులు కొరికేసింది. ఇదంతా వీడియోలో రికార్డ్ అవ్వ‌డంతో అన‌మ్ పోలీసుల‌కు ఫిర్యాదు చేసింది. విష‌యం బ‌యటికి పొక్క‌డంతో విచార‌ణ చేసి క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని తెలిపారు.

ALSO READ:

Delhi: బికినీ వేసుకుని బ‌స్సెక్కిన యువ‌తి

Viral News: 104 ఏళ్ల అమ్మ‌మ్మ‌తో 48 మ‌న‌వ‌డి డేటింగ్