నాడు ప్రిన్సెస్ డ‌యానా.. నేడు కొడుకు కారును వెంబ‌డించిన మీడియా

Britain: బ్రిట‌న్ యువ‌రాజు హ్యారీ(prince harry).. అత‌ని భార్య మేఘ‌న్ మార్కెల్(meghan markle) కారును ఫొటోల కోసం మీడియా వెంబ‌డించిన ఘ‌ట‌న బ్రిట‌న్(britain) రాజ్యంలో వివాదాస్ప‌దంగా మారింది. దాదాపు పాతికేళ్ల క్రితం.. హ్యారీ త‌ల్లి.. ప్రిన్సెస్ డ‌యానాని(princess diana) కూడా ఫొటోల కోసం మీడియా వెంబడించింది. దాంతో కారు డ్రైవ‌ర్ వేగంగా వెళ్ల‌డంతో వారి కారు చెట్టుకు ఢీకొట్టి ఆమె అక్క‌డిక‌క్క‌డే దుర్మ‌ర‌ణం చెందింది. ఇప్పుడు ఇలాంటి అనుభ‌వ‌మే ప్రిన్స్ హ్యారీ, అత‌ని భార్య మేఘ‌న్‌కు ఎదురైంది.

నిన్న రాత్రి హ్యారీ(prince harry), మేఘ‌న్‌.. ఆమె త‌ల్లి క‌లిసి న్యూయార్క్‌లో ఏదో ప‌ని మీద కారులో వెళ్తుండ‌గా అక్క‌డి మీడియా ఫొటోగ్రాఫ‌ర్లు ఫొటోల కోసం కారును వెంబ‌డించారు. దాంతో వారు త‌ప్పించుకునేందుకు వేగంగా వెళ్లాల్సిన ప‌రిస్థితి ఏర్ప‌డింది. న్యూయార్క్ పోలీసులు ప‌లువురు ఫొటోగ్రాఫ‌ర్ల‌ను అదుపులోకి తీసుకున్నారు. ముందు ముందు ఇలాంటి ఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కుండా చూసుకోవాల్సిన బాధ్య‌త పోలీసుల‌దేన‌ని సెల‌బ్రిటీలు, పబ్లిక్ ఫిగ‌ర్లు ఎక్క‌డ ఉంటే అక్కడ ఫొటోగ్రాఫ‌ర్లు వ‌చ్చేస్తున్నార‌ని హ్యారీ వ‌ద్ద ప‌నిచేస్తున్న ప్ర‌తినిధులు ఆగ్ర‌హం వ్య‌క్తం చేసారు.