పూజారి వికృత చేష్ట.. మహిళల చేంజింగ్ రూంలో సీక్రెట్ కెమెరా
మహిళల ఛేంజింగ్ రూంలో సీక్రెట్ కెమెరా పెట్టి వికృత చేష్టలు చేస్తున్న పూజారిని ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు అరెస్ట్ చేసారు. ఘజియాబాద్‌లోని మురద్ నగర్‌లో ఉన్న గంగా కెనాల్ సమీపంలో ఈ ఘటన చోటుచేసుకుంది. మహిళలు గంగా నదిలో స్నానాలు ఆచరించి అక్కడే ఉన్న ఛేంజింగ్ రూంలో దుస్తులు మార్చుకుంటూ ఉంటారు. ఈ నేపథ్యంలో నిన్న తల్లీ కూతుళ్లకు రూంలో పెట్టిన సీక్రెట్ కెమెరా కనిపించింది. వెంటనే వారు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఆ సీక్రెట్ కెమెరా ఫుటేజ్ స్థానిక పూజారి ఫోన్‌కి కనెక్ట్ అయ్యి ఉందని తెలుసుకుని షాకయ్యారు.
నిందితుడు గంగా నదీ సమీపంలో పూజలు నిర్వహించే ముఖేష్ గోస్వామిగా గుర్తించారు. ఇతనిపై ఆల్రెడీ ఇలాంటి నాలుగు కేసులు నమోదయ్యాయట. ప్రస్తుతం అతను పరారీలో ఉన్నాడని గాలింపులు చేపడుతున్నామని పోలీసులు తెలిపారు.