Pravallika Death: గ్రూప్ 2 కోసం కాదు.. ప్రేమ విఫలం
చిక్కడపల్లికి చెందిన ప్రవళిక (pravallika death) అనే యువతి ఆత్మహత్యపై క్లారిటీ ఇచ్చారు ఏసీపీ యాదగిరి. గ్రూప్ 2 పరీక్ష క్యాన్సిల్ అవ్వడం వల్లే ఆమె ఆత్మహత్య చేసుకుంది అని వస్తున్న వార్తల్లో ఎలాంటి నిజం లేదని.. ప్రేమ విఫలం అవడంతో ఆమె ఆత్మహత్య చేసుకున్నారని తెలిపారు. ఆమె మరణంపై తప్పుడు వార్తలు రాసేవారిపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. మరోపక్క ప్రవళిక కేసు విషయమై 48 గంటల్లో తనకు నివేదిక సమర్పించాలని గవర్నర్ తమిళిసై ఆదేశాలు జారీ చేసారు.