Suraj Revanna: తమ్ముడు ఆడవాళ్లపై అత్యాచారం.. అన్న మగాడిపై అత్యాచారం
Suraj Revanna: కర్ణాటకలోని హసన్ మాజీ ఎంపీ ప్రజ్వల్ రేవణ్ణ సెక్స్ కుంభకోణంలో ఇరుక్కున్న సంగతి తెలిసిందే. దాదాపు 3000 మంది ఆడవాళ్లపై అత్యాచారానికి పాల్పడి వారి వీడియోలను తీసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రస్తుతం కర్ణాటక పోలీసులు రేవణ్ణను అదుపులోకి తీసుకుని విచారణ చేపడుతున్నారు. ఇప్పుడు వీరి కుటుంబానికి సంబంధించిన మరో షాకింగ్ విషయం బయటపడింది. ప్రజ్వల్ ఆడవాళ్లపై అత్యాచారానికి పాల్పడుతుంటే.. అతని అన్న సూరజ్ రేవణ్ణ ఏకంగా మగాడిపై అత్యాచారం చేసాడు.
జేడీఎస్ పార్టీ వర్కర్‌గా పనిచేస్తున్న 26 ఏళ్ల యువకుడిపై సూరజ్ లైంగిక దాడి చేసాడట. ఈ నేపథ్యంలో ఆ యువకుడు పోలీసులను ఆశ్రయించాడు. దీనిపై సూరజ్ స్పందిస్తూ..అందులో ఏమాత్రం నిజం లేదని.. రూ.5 కోట్లు ఇవ్వనందుకు తనపై తప్పుడు కేసు బనాయించాడని ఆరోపిస్తున్నాడు. మరోపక్క సూరజ్ స్నేహితుడు శివకుమార్ కూడా పోలీసులకు అదే చెప్పాడు. కొన్ని నెలల క్రితం ఆ యువకుడు తన వద్దకు వచ్చి రూ.5 కోట్లు అడిగాడని.. ఇవ్వకుంటే సూరజ్‌పై లైంగిక దాడి కేసు పెడతానని హెచ్చరించాడని తెలిపాడు. దీనిపై పోలీసులు దర్యాప్తు చేపడుతున్నారు.