Pragyan Rover: 14 రోజులు బిజీ బిజీ..!

మొత్తానికి జాబిల్లిపై అడుగుపెట్టేసాం. త‌ర్వాత ఏంటి? ఏముంది.. విక్ర‌మ్ ల్యాండ‌ర్ (vikram lander) నుంచి విడిపోయిన ప్ర‌గ్యాన్ రోవ‌ర్ (pragyan rover) నేటి నుంచి 14 రోజుల పాటు చంద్రుడిపై తిరుగుతూ మొత్తం స‌మాచారాన్ని సేక‌రించి ఇస్రోకు (isro) చేర‌వేస్తుంది. విక్ర‌మ్ ల్యాండ‌ర్, ప్రగ్యాన్ రోవ‌ర్‌ల ప‌నితీరు బాగానే ఉంద‌ని ఇస్రో ఛైర్మ‌న్ సోమ‌నాథ్ (somnath) వెల్ల‌డించారు. వాటి ఫోటోల‌ను త్వ‌ర‌లో రిలీజ్ చేస్తామ‌ని తెలిపారు.

14 రోజులు బిజీ

6 చక్రాలు క‌లిగిన ప్ర‌గ్యాన్ రోవ‌ర్ నేటి నుంచి 14 రోజుల పాటు జాబిల్లిపై వివిధ ఎక్స్‌ప‌రిమెంట్లు చేస్తుంది. విక్ర‌మ్ ల్యాండ‌ర్ మాడ్యూల్‌లో మొత్తం ఐదు భారీ పేలోడ్స్ ఉన్నాయి. ఈ పేలోడ్స్ ద్వారా నిర్దేశించిన కొన్ని టాస్కుల‌ను ప్ర‌గ్యాన్ రోవ‌ర్ పూర్తి చేయాల్సి ఉంది. (pragyan rover) రోవ‌ర్‌కి అమ‌ర్చ‌బ‌డిన ఆల్ఫా పార్టిక‌ల్ ఎక్స్‌రే స్పెక్ట్రోమీట‌ర్ చంద్రుడిపై ఉన్న ర‌సాయ‌న, ఖ‌నిజ సంబంధిత ప‌దార్థాల‌ను సేక‌రిస్తుంది. స్పెక్ట్రోస్కోప్‌లో అమ‌ర్చ‌బ‌డిన లేజ‌ర్ ద్వారా చంద్రుడిపై ఉన్న మ‌ట్టి రాళ్లలో ఎలాంటి ఎలిమెంట్స్ ఉన్నాయో క‌నిపెట్టానికి దోహ‌ద‌ప‌డుతుంది.

RAMBHA-LP (ల్యాంగ్ముయిర్ ప్రోబ్)

ల్యాండ‌ర్‌లో RAMBHA-LP అనే ప‌రిక‌రం జాబిల్లిపై ఐయాన్స్, ఎల‌క్ట్రాన్స్ ప‌నితీరు, స‌మ‌యానుగుణంగా అవి చెందే మార్పుల‌ను క‌నుక్కుంటుంది. 14 రోజుల ప‌ని పూర్త‌య్యాక రోవ‌ర్‌కి ఉన్న సోలార్ ఎన‌ర్జీ కాస్త త‌గ్గుతుంది. ఈ స‌మ‌యంలో విక్ర‌మ్ ల్యాండ‌ర్‌ను ట‌చ్ అయ్యి అప్ప‌టివ‌ర‌కు సేకరించిన డేటా మొత్తం ఇస్రోకు చేర‌వేస్తుంది. ఇస్రోకి ప్ర‌గ్యాన్ రోవ‌ర్‌తో డైరెక్ట్ లింక్ లేదు. ఏది చేసినా విక్ర‌మ్ ల్యాండ‌రే చేయాలి. (pragyan rover)

ఆ ప‌రిశోధ‌న‌లే చంద్ర‌యాన్-3కి కార‌ణం

చంద్రుడికి ద‌క్షిణ ధ్రువం వైపు అంటే మ‌నం రోజూ చూసే జాబిల్లి వైపు కాకుండా వెనుక వైపున నీటితో గ‌డ్డ క‌ట్టిన ప్ర‌దేశాన్ని ప‌రిశోధ‌న‌ల్లో గుర్తించింది ఇస్రో. దాంతో ఆక్సిజన్, ఇంధనం, నీటి మూలంగా ఆ ప్ర‌దేశం గ‌డ్డ క‌ట్టి ఉంటుంద‌ని భావించి మ‌రింత తెలుసుకునేందుకు ఇస్రో చంద్ర‌యాన్ మిష‌న్‌కు శ్రీకారం చుట్టింది.. అమెరికా, చైనా, ర‌ష్యా దేశాల త‌ర్వాత ఈ మిష‌న్‌ను చేప‌ట్టింది మ‌న భార‌తే. కాక‌పోతే అవి ఫెయిల్ అయ్యాయి. మ‌నం స‌క్సెస్ అయ్యాం. (pragyan rover)