Manipur: రేప్ చేయించింది పోలీసులే..!
Manipur: ఎంత దారుణం. రెండు నెలలుగా అల్లర్లతో అట్టుడికిపోతున్న మణిపూర్‌లో (manipur) నిన్న అమానవీయ ఘటన చోటుచేసుకుంది. ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించి వారిలో ఒకరిపై అత్యాచారానికి పాల్పడ్డారు. ఆ వీడియోలు బయటికి రావడంతో దేశం దద్దరిల్లింది. మొన్నటివరకు మౌనంగా ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ.. ఈ ఘటన వైరల్ అవుతండడంతో వెంటనే స్పందించి యాక్షన్ తీసుకున్నారు. ప్రధాన నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అయితే బాధిత మహిళలు స్థానిక మీడియా వర్గాలతో మాట్లాడారు. తమ పట్ల ఇంత దారుణంగా ప్రవర్తిస్తుంటే ఏ ఒక్క పోలీసూ అడ్డుకోలేదని వాపోయారు. అల్లర్లకు పాల్పడుతున్నవారికి పోలీసుల సపోర్ట్ ఉందని, తమను నగ్నంగా ఊరేగించి అత్యాచారం చేసేలా చేసింది కూడా పోలీసులే అని షాకింగ్ వివరాలు బయటపెట్టారు. (manipur)