Police: G20 బందోబస్త్‌కి వెళ్తుండగా పోలీస్‌నే దోపిడీ..!
ఇంతకంటే అవమానకరం ఉంటుందా? ఓ దొంగ ఏకంగా పోలీస్‌కే (police) గన్ను గురిపెట్టి అన్నీ దోచుకునిపోయాడు. ఈ ఘటన గురుగ్రామ్‌లో చోటుచేసుకుంది. రాజ్‌కుమార్ అనే 32 ఏళ్ల కానిస్టేబుల్ గురుగ్రామ్‌లోని ఎస్పీఆర్ రోడ్డులో జీ20 (g20 summit) బందోబస్త్‌కి వెళ్తుండగా ఇద్దరు వ్యక్తులు మాస్కులతో వచ్చి ఆయన్ను అడ్డుకున్నారు. గన్ను గురిపెట్టి ఆయన ప్రయాణిస్తున్న కారును తీసుకుని పారిపోయారు. ఆ తర్వాత ఆయన మరో పోలీస్ సాయంతో ఫిర్యాదు చేసారు. ఆ సమయంలో కారులో యూనిఫాం, రూ.5000 ఉన్న వాలెట్, ఐడీ కార్డు, డ్రైవింగ్ లైసెన్సు ఉన్నాయని.. చీకటిగా ఉండడంతో దొంగలు వచ్చిన కారు నెంబర్ ప్లేట్ చూడలేదని అన్నారు. టోల్ ప్లాజాల వద్ద సీసీటీవీ ఫుటేజ్‌ల ఆధారంగా త్వరలో దొంగల్ని పట్టుకుంటామని అధికారులు తెలిపారు. (police)