పొదల్లో దొరికిన పసిబిడ్డను దత్తత తీసుకున్న పోలీసు
Police: అప్పుడే పుట్టిన ఓ పసిబిడ్డను గుర్తుతెలియని వ్యక్తులు పొదల్లో వదిలేయడంతో ఆ బిడ్డను ఓ పోలీస్ దత్తత తీసుకున్న ఘటన
ఉత్తర్‌ప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. విషయం తెలుసుకున్న ఎస్ఐ పుష్పేంద్ర సింగ్ అక్కడికి చేరుకొని, ఆ బుజ్జాయిని చూసి చలించిపోయాడు. పెళ్లై ఆరేళ్లెనా ఆయనకు పిల్లలు కలగలేదు. దీంతో దశమి రోజు దేవుడిచ్చిన వరంగా భావించి భార్యతో కలిసి ఆ పసిబిడ్డను దత్తత తీసుకున్నాడు.