Pilot: గాల్లో విమానం.. చ‌నిపోయిన పైల‌ట్..!

దాదాపు 300 మంది ప్ర‌యాణికుల‌తో వెళ్తున్న విమానం.. బాత్రూమ్ వస్తోంద‌ని వెళ్లిన పైల‌ట్ (pilot) ఎంత‌కీ తిరిగి రాలేదు. దాంతో కో పైల‌ట్‌కి ఏం చేయాలో అర్థంకాక ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వ‌చ్చింది. ఈ ఒళ్లు గ‌గుర్పొడిచే ఘ‌ట‌న మ‌యామీ నుంచి చిలీ వెళ్తున్న విమానంలో చోటుచేసుకుంది. లాటామ్ ఎయిర్‌లైన్స్‌కి చెందిన ఓ విమానానికి ఇవాన్ అనే 56 ఏళ్ల వ్య‌క్తి పైల‌ట్‌గా వ్య‌వ‌హ‌రిస్తున్నాడు. విమానం గాల్లో ఉండ‌గా ఇవాన్ బాత్రూమ్‌కి వెళ్లాడు. ఆయ‌న ఎంత‌కీ తిరిగి రాలేదు.

కో పైల‌ట్ వెళ్లి చూడ‌గా.. అత‌ను బాత్రూమ్‌లో ప‌డిపోయి ఉన్నాడు. దాంతో కో పైల‌ట్‌కు మ‌రో ఆప్ష‌న్ లేక వెంట‌నే విమానాన్ని ప‌నామాకు మ‌ళ్లించి ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వ‌చ్చింది. వెంట‌నే వైద్య బృందాన్ని పిలిపించి ఇవాన్‌ను ప‌రీక్షించారు. అప్ప‌టికే ఆయ‌న చ‌నిపోయిన‌ట్లు గుర్తించారు. బాత్రూమ్‌కి వెళ్లినప్పుడు ఇవాన్‌కు గుండెపోటు రావ‌డం వ‌ల్లే ఆయ‌న చ‌నిపోయిన‌ట్లు తెలిపారు. ఇవాన్ బాత్రూమ్‌లో ప‌డిపోయిన‌ప్పుడే కో పైల‌ట్ ప్ర‌యాణికుల్లో ఎవరైనా వైద్యులు ఉన్నారా అని అనౌన్స్‌మెంట్ ఇచ్చాడ‌ట‌. అప్ప‌టికే ఇవాన్ ఆరోగ్యం క్షీణిస్తున్న‌ట్లు తెలీడంతో ఇక ఎమ‌ర్జెన్సీ ల్యాండింగ్ చేయాల్సి వ‌చ్చింద‌ని అధికారులు తెలిపారు. (pilot)