Pavithra Gowda: నాకు చెప్పకుండా భార్యతో ట్రిప్‌కి వెళ్లాడు..కోపమొచ్చింది
Pavithra Gowda: రేణుకా స్వామి మర్డర్ కేసులో భాగంగా ఏ1గా ఉన్న పవిత్ర గౌడ తనకు దర్శన్‌తో ఉన్న రిలేషన్‌షిప్ గురించి చార్జ్‌షీట్‌లో పేర్కొన్నారు. బుల్ బుల్ అనే సినిమాకు ఆడిషన్స్ జరుగుతున్న సమయంలో తనకు తెలిసిన మేనేజర్ నుంచి దర్శన్ నెంబర్ దొరికిందని.. అలా తొలిసారి దర్శన్‌తో మాట్లాడానని అన్నారు. కానీ ఆ సినిమా ఆడిషన్ అయిపోవడంతో వేరే సినిమాలో ఏమన్నా ఛాన్సులు ఉంటే చూస్తానని చెప్పాడట.
అలా రోజూ చాటింగ్స్, కాల్స్ చేసుకునేవాళ్లు. అయితే పవిత్ర గౌడ దర్శన్‌ను ప్రేమించే సమయానికే దర్శన్‌కు విజయలక్ష్మి అనే మహిళతో వివాహం అయ్యిందన్న విషయం తనకు తెలీదని పోలీసులకు వెల్లడించింది. అప్పటికే తమ రిలేషన్‌షిప్ చాలా స్ట్రాంగ్‌గా ఉందని.. విజయలక్ష్మి ఉందని తెలిసీ తాను దర్శన్‌ని ప్రేమించడం ఆపలేదని తెలిపింది. అంతేకాదు.. మే 19న దర్శన్ తన పెళ్లి రోజును ఘనంగా జరుపుకునేందుకు విజయలక్ష్మిని తీసుకుని దుబాయ్ వెళ్లాడని.. ఈ విషయం తనకు చెప్పనందుకు కొన్ని రోజుల పాటు దర్శన్‌తో మాట్లాడలేదని పేర్కొంది.
ఈ గ్యాప్‌లోనే రేణుకా స్వామి నుంచి తనకు అసభ్యకరమైన మెసేజ్‌లు వచ్చాయని.. దర్శన్‌పై కోపంతో పవన్ అనే సన్నిహితుడికి రేణుకను పట్టుకుని తీసుకురావాలని చెప్పానని తెలిపింది. కానీ పవన్ ఈ విషయాన్ని దర్శన్‌కు చెప్పడంతో ఇంత దాకా వచ్చిందని వెల్లడించింది. ఇదంతా ఛార్జ్‌షీట్‌లో పోలీసులు పేర్కొన్నారు.