Patanjali: పతంజలి టూత్‌పేస్ట్‌లో చేప ఆనవాళ్లు
Patanjali: బాబా రామ్‌దేవ్‌కి చెందిన పతంజలి సంస్థకు మరో షాక్ ఎదురైంది. పతంజలి నుంచి తయారైన దివ్య మంజన్ టూత్‌పేస్ట్‌లో చేప ఆనవాళ్లు ఉన్నాయంటూ ఫిర్యాదు రావడంతో ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. యతిన్ శర్మ అనే అడ్వకేట్ కొంతకాలంగా పతంజలి టూత్‌పేస్ట్ వాడుతున్నారట. అది పూర్తిగా శాకాహార పదార్థాలతో తయారుచేసింది అని చెప్పడంతో దానిని వాడటం మొదలుపెట్టాడు. అయితే ఇటీవల ఆ పేస్ట్‌పై పరిశోధనలు నిర్వహించగా అందులో చేపకు సంబంధించిన పదార్థం కలిపి ఉన్నట్లు తేలిందట. దాంతో యతిన్ ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ వేసారు. తన కుటుంబం అసలు మాంసాహారమే ముట్టదని అలాంటిది పతంజలి వల్ల మోసపోయామని ఆవేదన వ్యక్తం చేసారు. ఈ బ్రాండ్‌పై తగిన చర్యలు తీసుకోవాలని కోరాడు.
తనకు పరిహారం ఇప్పించి న్యాయం చేయాలని కోర్టును కోరడంతో పతంజలి సంస్థతో పాటు కేంద్ర ప్రభుత్వానికి, ఉత్పత్తులను తయారుచేసే పతంజలి ఫార్మసీకి నోటీసులు జారీ చేసింది. ఈ కేసుపై తదుపరి విచారణ నవంబర్ 28కి వాయిదా వేసారు.