Pat Cummins: కోహ్లీ ఔట్ అయినప్పుడు ఆ సైలెన్స్ ఎంతో సంతృప్తినిచ్చింది

Pat Cummins: ఆశ‌లు అడియాల‌స‌లైపోయాయి.. క‌ప్పు మ‌న చేజారిపోయింది. నిన్న ఆస్ట్రేలియా ఇండియాకు మ‌ధ్య జ‌రిగిన ఉత్కంఠ పోరులో విజ‌యం ఆస్ట్రేలియానే వ‌రించింది. ఈ సంద‌ర్భంగా ఆస్ట్రేలియా టీం కెప్టెన్ ప్యాట్ క‌మ్మిన్స్ మీడియాతో మాట్లాడుతూ.. స్టేడియంలో మ్యాచ్ వీక్షిస్తున్న ల‌క్షలాది మందిని సైలెంట్ చేయ‌డ‌మే తన ధ్యేయ‌మ‌ని మ్యాచ్‌కి ముందే చెప్పాన‌ని.. అందులోనూ విరాట్ కోహ్లీ (virat kohli) ఔట్ అయిన‌ప్పుడు వ‌చ్చిన నిశ్శ‌బ్దం ఎంతో సంతృప్తినిచ్చింద‌ని తెలిపాడు. ఇది ఆస్ట్రేలియాకు వ‌చ్చిన ఆరో ప్ర‌పంచ క‌ప్. ఈ మ్యాచ్‌తో తాను మ‌ళ్లీ 50 ఓవ‌ర్ల ఫార్మాట్‌తో ప్రేమ‌లో ప‌డ్డాన‌ని తెలిపాడు.