Viral News: వ‌రుడి ఆత్మ కావ‌లెను.. పేప‌ర్‌లో వింత ప్ర‌క‌ట‌న‌

parents wants spirit groom for their dead daughter

Viral News: వ‌రుడు, వ‌ధువు కావ‌లెను అని పేప‌ర్‌లో ప్ర‌క‌ట‌న‌లు చూస్తుంటాం. కానీ వ‌రుడి ఆత్మ కావ‌లెను అని ఓ కుటుంబం పేప‌ర్‌లో ప్ర‌క‌ట‌న వేయించ‌డంతో అది చ‌దివిన వారంతా భ‌య‌భ్రాంతుల‌కు గుర‌వుతున్నారు. ఈ ఘ‌ట‌న ద‌క్షిణ క‌న్నడ జిల్లాలోని పుత్తూరులో చోటుచేసుకుంది. మ్యాట‌ర్ ఏంటంటే.. ద‌క్షిణ క‌న్న‌డ‌, తులునాడు, ఉడుపి ప్రాంతాల్లో ఓ వింత సంప్ర‌దాయం ఉంది. అదేంటంటే.. పెళ్లి కాకుండా అమ్మాయి కానీ అబ్బాయి కానీ చ‌నిపోతే వారి ఆత్మ‌ల‌కు పెళ్లిళ్లు చేస్తుంటారు. ఈ సంప్ర‌దాయాన్ని కులె మ‌డిమె లేదా ప్రేత మాడువె అని అంటారు.

ఈ ప్ర‌క్రియ‌ను అక్క‌డి ప్ర‌జ‌లు ఇంకా అనుస‌రిస్తున్నారు. ఈ నేప‌థ్యంలోనే పేప‌ర్‌లో ప్ర‌క‌ట‌న వేయించారు. త‌మ బిడ్డ 30 ఏళ్ల క్రిత‌మే చ‌నిపోయింద‌ని.. అందుకే కులాల్ కులానికి చెందిన బంగేర గోత్రం ఉన్న వ‌రుడి ఆత్మ‌తో పెళ్లి చేయాల‌ని అన‌కుంటున్న‌ట్లు తెలిపారు. అందుకే ఈ ప్ర‌క‌ట‌న వేయించార‌ట‌. అయితే ప్ర‌క‌ట‌న వేయించాక దాదాపు 50 మంది ఫోన్ కాల్స్ చేసార‌ట‌. ఒక వ‌రుడి ఆత్మ‌ను ఫిక్స్ చేసామ‌ని.. త్వ‌ర‌లో పెళ్లి తంతు నిర్వ‌హిస్తామ‌ని ఆ కుటుంబీకులు తెలిపారు. ఇలాంటి ఆచారాలు అనుస‌రిస్తున్నామ‌ని చాలా మంది త‌మ‌ను వెక్కిరిస్తార‌ని అనుకున్నామ‌ని.. కానీ వీటికి విలువ ఇచ్చే వారు ఇంకా ఉన్నందుకు సంతోషంగా ఉంద‌ని ఆ కుటుంబం తెలిపింది.