Palnadu: క్రికెట్ బెట్టింగ్‌లో అప్పులపాలై సాఫ్ట్‌వేర్ ఉద్యోగి ఆత్మహత్య

Palnadu: పల్నాడు జిల్లా సాతులూరులో దారుణం చోటుచేసుకుంది. క్రికెట్ బెట్టింగ్‌లో డ‌బ్బులు పెట్టి పోగొట్టుకుని అప్పుల‌పాలైన గంగిరెడ్డి అనే సాఫ్ట్‌వేర్ ఆత్మ‌హ‌త్య‌కు పాల్ప‌డ్డాడు. క్రికెట్ బెట్టింగ్‌లో 40 లక్షలు నష్టపోయాడు. దాంతో నిన్న రాత్రి రైలు పట్టాలపై తనువు చాలించాడు. గంగిరెడ్డికి ఇటీవలే వివాహం కాగా ఐదు నెలల పసిపాప ఉంది.