Palestine చిన్నారిని 26 సార్లు పొడిచిన అమెరికన్
ద్వేషపూరితమైన (hate crime) కక్ష కారణంగా ఆరేళ్ల చిన్నారి దారుణ హత్యకు గురయ్యాడు. పాలెస్తీనాకు (palestine) చెందిన ఆరేళ్ల బాలుడిని అమెరికాకు (america) చెందిన వృద్ధుడు ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 26 సార్లు పొడిచి చంపాడు. ఇల్లినోయ్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. పాలెస్తీనాకు చెందిన ఓ ముస్లిం మహిళ తన కుమారుడితో కలిసి ఇల్లినోయ్‌లో ఉంటోంది.
ఇజ్రాయెల్ గాజా (israel gaza war) మధ్య జరుగుతున్న యుద్ధం నేపథ్యంలో ఆ మహిళ ఉంటున్న ఇంటి ఓనర్ నిన్న రాత్రి దాడికి పాల్పడ్డాడు. మహిళ పరిస్థితి విషమంగా ఉండగా.. ఆమె కుమారుడు చనిపోయాడు. నిందితుడు దాడి చేస్తున్న క్రమంలో ఆ మహిళ 911కి కాల్ చేయడంతో అధికారులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకుని అతన్ని అదుపులోకి తీసుకోగలిగారు. మీ ముస్లింలు చావాల్సిందే అంటూ నిందితుడు ఆ మహిళపై దాడికి పాల్పడినట్లు పోలీసులు తెలిపారు.