ఉద్యోగం కావాలంటే బాస్‌తో గడపాలి.. యువతికి చేదు అనుభవం
Viral News: ఉద్యోగం కావాలంటే బాస్‌తో గడపాలని ఓ కంపెనీ మేనేజర్ యువతికి చెప్పడం వివాదాస్పదంగా మారింది. ఓ పాకిస్థానీ యువతికి ఈ చేదు అనుభవం ఎదురైంది. దాంతో ఆమె తన పట్ల జరిగిన అనుభవాన్ని ట్విటర్‌లో పంచుకుంది.
అదీనా హీరా అనే యువతి ఇండీడ్ వెబ్‌సైట్‌లో ఉద్యోగాల కోసం వెతుకుతుండగా.. గిగా గ్రూప్ అనే ఓ పెద్ద కంపెనీలో అవకాశాలు ఉన్నాయని తెలిసి ఇంటర్వ్యూకి వెళ్లింది. ఆఫీస్ అసిస్టెంట్ జాబ్ కోసం ఆ అమ్మాయి దరఖాస్తు చేసుకోగా.. ఇంటర్వ్యూ చేసిన మేనేజర్ ఆమెను ఎంపికచేసాడు. అయితే ఆఫర్ లెటర్ ఇవ్వడానికి ముందు అప్పుడప్పుడు బాస్‌తో గడపాల్సి వస్తుందని.. అప్పుడే ఉద్యోగానికి భరోసా ఉంటుందని అన్నాడు. దాంతో ఆమె షాక్‌కు గురైంది. వెంటనే అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఈ విషయాన్ని ఆమె ట్విటర్ ద్వారా వెల్లడించడంతో వెంటనే గిగా గ్రూప్ సంస్థ స్పందించింది. అలా వాగిన మేనేజర్‌కు తమ కంపెనీకి సంబంధం లేదని.. అతనిపై పోలీసులకు ఫిర్యాదు కూడా చేసామని పేర్కొంది.