కూతురి తలకు సీసీ కెమెరా పెట్టించిన తండ్రి
Pakistan: ఇళ్ల ముందు, రోడ్లపై సీసీ కెమెరాలను చూస్తూ ఉంటాం. కానీ మనిషికి సీసీ కెమెరా పెట్టడం ఎప్పుడైనా చూసారా? పాపం పై ఫోటోలోఉన్న అమ్మాయికి ఈ గతి పట్టింది. ఆ సీసీ కెమెరా అమర్చింది ఎవరో కాదు.. స్వయంగా ఆ పిల్ల తండ్రే. ఈ ఘటన పాకిస్థాన్‌లో చోటుచేసుకుంది. కరాచీకి చెందిన ఓ యువతి తలకు అమర్చిన సీసీ కెమెరాతో రోడ్లపై తిరుగుతుండడం స్థానికులను విస్మయానికి గురిచేసింది. దాంతో మీడియా వర్గాలు ఆమెను చుట్టుముట్టాయి. ఏం జరిగింది? ఈ సీసీ కెమెరా ఏంటి అని స్థానిక విలేకర్లు అడగ్గా.. తన రక్షణ కోసమే తన తండ్రి ఇలా కెమెరా పెట్టించాడని తెలిపింది. తనకు ఇలా సీసీ కెమెరా పెట్టుకుని తిరగడంలో ఎలాంటి అభ్యంతరం లేదని చెప్తోంది.
ఆ తండ్రికి ఈ ఆలోచన ఎందుకు వచ్చిందంటే.. నెల రోజుల క్రితం కరాచీలో జరిగిన ఓ ఘటనలో ఓ ఆడపిల్ల చనిపోయింది. అది కళ్లారా చూసిన ఆ తండ్రి తన బిడ్డకు ఇలాంటి ఘటనలు ఎదురుకాకూడదన్న భయంతో సమాజం ఏమనుకున్నా తనకు అవసరం లేదనుకుని ఇలా కెమెరా పెట్టించాడట. కెమెరా పెట్టించిన తండ్రికి పెట్టించుకున్న కూతురికి లేని బాధ మనకెందుకులే అని స్థానికులు కూడా పట్టించుకోవడం మానేసారు.