Seema Haider: పాక్ మహిళతో సినిమా ప్లానింగ్
Hyderabad: పాకిస్థాన్ నుంచి అక్రమంగా ఇండియాకి వచ్చిన సీమా హైదర్‌తో (seema haider) సినిమా ప్లానింగ్ చేస్తున్నారట. ఇందుకోసం ఆమెతో పలు ఆడిషన్లు చేయిస్తున్నట్లు తెలుస్తోంది. రాజస్థాన్‌లోని ఉదయ్‌పూర్‌లో చోటుచేసుకున్న టైలర్ హత్య కేసును సినిమాగా తీయబోతున్నారు. దీనికి ఎ టైలర్ మర్డర్ స్టోరీ అనే టైటిల్ పెట్టారు. ఇందులో సీమాను పాక్ గూఢచారిగా నటించాలని అడుగుతున్నారట. ఇందుకోసం ఆమెను ఆడిషన్ కూడా చేస్తున్నారు.
ప్రస్తుతం నోయిడాలో తన భర్త సచిన్‌తో కలిసి ఉంటున్న సీమాను (seema haider) జాని ఫైర్ఫాక్స్ ప్రొడక్షన్ హౌజ్ వాళ్లు సంప్రదించారు. జయంత్ సిన్హా, భరత్ సింగ్ అనే ఇద్దరు డైరెక్టర్లు ఆమె ఆడిషన్ కూడా తీసుకున్నారు. అయితే ప్రస్తుతం సీమాపై ఉత్తర్‌ప్రదేశ్‌కు చెందిన యాంటీ టెర్రర్ స్వ్కాడ్ అధికారులు నిఘా ఉంచారు. పిలిచినప్పుడల్లా విచారణకు రావాలని ఆదేశించారు. దాంతో వారి నుంచి క్లీన్ చిట్ వచ్చాకే సినిమాలో నటిస్తానని సీమా ప్రొడక్షన్ హౌజ్‌తో చెప్పినట్లు తెలుస్తోంది.
ఉదయ్‌పూర్ మర్డర్
ఉదయ్‌పూర్‌కు చెందిన కన్నయ్య లాల్ అనే వ్యక్తి టైలర్‌గా పనిచేస్తూ జీవిస్తుండేవాడు. దాదాపు నాలుగేళ్ల క్రితం నుపూర్ శర్మ అనే యువతి మహమ్మద ప్రవక్త గురించి సోషల్ మీడియాలో తప్పుగా పోస్ట్ పెడితే.. కన్నయ్య ఆ పోస్ట్‌కి లైక్ కొట్టి సపోర్ట్ చేసాడు. దాంతో మహమ్మద్ రియాజ్ అట్టారీ, గౌస్ మహమ్మద్ అనే ఇద్దరు వ్యక్తులు కస్టమర్లుగా కన్నయ్య టైలరింగ్ షాప్‌లోకి వెళ్లి అతన్ని దారుణంగా హత్య చేసారు. ఆ తర్వాత ఆ హత్యను వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేయడంతో దేశవ్యాప్తంగా ఈ ఘటన సంచలనంగా మారింది. ఇప్పుడు ఇదే కథతో సీమా హైదర్‌ను (seema haider) పెట్టి సినిమా తీయాలని అనుకుంటున్నారట.