Pakistan Woman: ఇండియాకి టెర్రర్ ఎటాక్ బెదిరింపులు
Noida: పబ్జీలో పరిచయం అయిన నోయిడా వ్యక్తి కోసం పాకిస్థాన్ నుంచి వచ్చేసిన సీమా హైదర్ (pakistan woman) విషయంలో కొత్త టెన్షన్ మొదలైంది. సీమాను (seema haider) పాకిస్థాన్ పంపించే ఏర్పాట్లు చేయకపోతే 26/11 లాంటి టెర్రర్ ఎటాక్స్ జరుగుతాయ్ అంటూ ముంబైలోని ట్రాఫిక్ కంట్రోల్ రూంకు బెదిరింపు కాల్స్ వచ్చాయి. కాల్ చేసిన వ్యక్తి ఉర్దూలో మాట్లాడినట్లు పోలీసులు తెలిపారు. 2008 నవంబర్ 26లో ముంబైలో జరిగిన భయంకర టెర్రర్ ఎటాక్‌ను గుర్తుచేస్తూ.. సీమాను పంపకపోతే అలాంటి దాడులు మళ్లీ జరుగుతాయ్ అంటూ బెదిరింపులకు పాల్పడ్డాడు. ఈసారి దాడులు జరిగితే అందుకు కారణం ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వమే బాధ్యత వహించాలని కూడా అన్నాడట. ఎందుకంటే సీమాకు ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వమే రక్షణ కల్పించింది. ఆమె తన పిల్లలతో కలిసి నచ్చిన వ్యక్తితో ఇండియాలోనే హాయిగా ఉండొచ్చని కూడా చెప్పింది. దాంతో ఆ కాల్ ఎక్కడి నుంచి వచ్చింది అనే దానిపై ముంబై క్రైం బ్రాంచ్ విచారణ చేపడుతోంది.
కొన్ని రోజుల క్రితం సీమా హైదర్ అనే పాకిస్థానీ మహిళ పబ్జీ ఆడుతూ నోయిడాకు చెందిన సచిన్ అనే వ్యక్తితో పరిచయం పెంచుకుంది. సచిన్ చెప్పడంతో సీమా తన ఐదుగురు పిల్లలతో కలిసి నేపాల్ ద్వారా అక్రమంగా ఇండియాలోకి ప్రవేశించింది. విషయం తెలిసి పోలీసులు వారిద్దరినీ అరెస్ట్ చేసి వారం రోజులు జైల్లో పెట్టారు. బెయిల్‌పై బయటికి వచ్చాక తనకు ఇండియాలోనే బతకాలని ఉందని పాక్‌కి వెళ్తే చంపేస్తారని కన్నీరుపెట్టుకుంది. తనకు సచిన్ అంటే ఇష్టమని అతని కోసం మతం మార్చుకుని పిల్లలతో ఇక్కడే ఉంటానని ఉత్తర్ ప్రదేశ్ ప్రభుత్వాన్ని కోరింది. మరోపక్క సీమా భర్త సౌదీ అరేబియాలో ఉద్యోగం చేస్తున్నాడు. అతను వీడియో కాల్ ద్వారా యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్‌కు రిక్వెస్ట్ పెట్టాడు. తన భార్య తెలీక తప్పు చేసిందని, తనను పిల్లల్ని జాగ్రత్తగా పాకిస్థాన్ పంపాలని కోరాడు.