Seema Haider: ఇండియాకి రానున్న మాజీ భ‌ర్త‌

Hyderabad: ప‌బ్జీలో ప‌రిచ‌యం అయిన ఇండియ‌న్ ప్రేమికుడి కోసం క‌ట్టుకున్న భ‌ర్త‌ను వ‌దిలేసి పాకిస్థాన్ నుంచి ఇండియా వ‌చ్చిన సీమా హైద‌ర్ (seema haider) క‌థ గురించి అంద‌రికీ తెలిసిందే. ఆమెపై యాంటీ టెర్ర‌ర్ స్వ్కాడ్ (ats) నిఘా ఉంది. ఎందుకైనా మంచిద‌ని ఆమెను వారానికి ఒక‌సారి పిలిచి విచార‌ణ‌లు చేస్తున్నారు. అయితే సీమా హైద‌ర్ మాజీ భ‌ర్త గులామ్ హైద‌ర్ (ghulam haider) ఇండియా రానున్నాడ‌ట‌. నోయిడాకు చెందిన జాని ఫైర్ ఫాక్స్ అనే ప్రొడ‌క్ష‌న్ కంపెనీ (jani fire fox) సీమాను (seema haider) పాకిస్థాన్ గూఢ‌చారిగా పెట్టి క‌రాచీ టు నోయిడా (karachi to noida) అనే సినిమాను తీస్తోంది. ఈ సినిమా కోస‌మ‌ని నిర్మాత‌లు గులామ్ హైద‌ర్‌ను ఇండియాకు ర‌ప్పిస్తున్నారు.

సీమా గురించి మ‌రిన్ని వివ‌రాలు తెలుసుకోవాల‌ని నిర్మాత జానీ గులామ్‌ను ముంబైకి కానీ ఢిల్లీకి కానీ రావాల‌ని ఆహ్వానించార‌ట‌. ఒక‌వేళ గులామ్ ఇండియాకు రాలేక‌పోతే.. త‌న కంపెనీ నుంచి ఒక రైట‌ర్‌ను గులామ్ ఉంటున్న సౌదీ అరేబియాలోని త‌న నివాసానికే పంపుతామ‌ని జానీ తెలిపారు. ప‌బ్జీతో ఒక పాకిస్థానీకి ఒక‌ ఇండియ‌న్‌కి మ‌ధ్య ప్రేమ ఎలా చిగురించింది అనే కాన్సెప్ట్‌పై సినిమా తీయాల‌ని అనుకుంటున్నామ‌ని, సీమా (seema haider) పాక్ గూఢ‌చారా? కాదా? అనే ఇంట్రెస్టింగ్ అంశాల‌తో సినిమాను తీస్తున్నామ‌ని జానీ తెలిపాడు.