Independence Day: అలిగిన పాకిస్థాన్
Hyderabad: పాకిస్థాన్ (pakistan) అలిగింది. మనకు వారికి కేవలం ఒక్క రోజు తేడాతో స్వాతంత్ర్యం (independence day) వచ్చింది. మనం ఈరోజు స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటుంటే.. పాకిస్థానీయులు ఆగస్ట్ 14న జరుపుకుంటారు. అయితే ఇప్పుడు పాక్ అలకకు కారణం ఏంటంటే.. ఈరోజు ఇండియా 77వ స్వాతంత్ర్య దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా బుర్జ్ ఖలీఫాపై (burj khalifa) మన జాతీయ జెండాను డిస్‌ప్లే చేసారు. అయితే పాకిస్థాన్ స్వాతంత్ర్య దినోత్సవం రోజున మాత్రం బుర్జ్ ఖలీఫాపై పాక్ జెండాను చూపించలేదు.
దాంతో పాక్ అలిగింది. ఆగస్ట్ 13న అర్థరాత్రి దుబాయ్‌లో నివసిస్తున్న పాకిస్థానీలు బుర్జ్ ఖలీఫా దగ్గర నిలబడి తమ జాతీయ జెండాను డిస్‌ప్లే చేస్తారేమోనని చాలా సేపు ఎదురుచూసారట. కానీ పాపం అలాంటిది ఏమీ జరగలేదు. దాంతో వాళ్లు ఆలా డిసపాయింట్ అయ్యారు. దాంతో ఇక చేసేదేమీ లేక వారికి వారే పాకిస్థాన్ జిందాబాద్ అని అరుస్తూ సెలబ్రేట్ చేసుకున్నారు. ఆ సమయంలో అక్కడే ఉన్న పాకిస్థానీ యువతి వీడియోను తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. తమతో బుర్జ్ ఖలీఫా ప్రాంక్ చేయడం బాధాకరమని చెప్పింది. ఇప్పుడు మన జాతీయ జెండాను బుర్జ్ ఖలీఫాపై డిస్‌ప్లే చేసినందుకు పాక్ తెగ ఏడుస్తోందట. (independence day)