Rent క‌ట్టలేద‌ని చంపేసిన ఓన‌ర్

Gurugram: ఓ వ్య‌క్తి రెంట్(rent) క‌ట్ట‌డంలేద‌ని అత‌న్ని ఓన‌ర్ దారుణంగా చంపేసిన ఘ‌టన గురుగ్రామ్‌లో(gurugram) చోటుచేసుకుంది. గురుగ్రామ్‌లోని సెక్టార్ 5లో నివ‌సిస్తున్న రాజేంద్ర అనే వ్య‌క్తికి తాగుడు అల‌వాటు ఉంది. దాంతో కొన్ని నెల‌లుగా రెంట్ క‌ట్ట‌కుండా తాగుతూ త‌ప్పించుకుని తిరుగుతున్నాడు. రెంట్ ఇస్తావా లేదా అంటూ ఓన‌ర్ సురేష్‌ ప‌లు మార్లు అడిగి విసిగిపోయాడు. నిన్న రాత్రి రెంట్ విష‌యం మాట్లాడేందుకు సురేష్‌.. రాజేంద్ర ఇంటికి వెళ్లాడు. అప్ప‌టికే రాజేంద్ర తాగుతూ ఉండ‌టంతో సురేష్‌ని కంపెనీ ఇవ్వ‌మ‌ని అడిగాడు. అలా ఇద్ద‌రూ పీక‌ల‌దాకా తాగారు. రెంట్ విష‌యం గురించి మాట్లాడేస‌రికి రాజేంద్ర డ‌బ్బులు లేవ‌ని చెప్ప‌డంతో సురేష్‌కి ఒళ్లుమండింది. రాజేంద్ర గొంతు నులిపి చంపేసాడు. ఎవ్వ‌రికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని వాట‌ర్ బూస్ట‌ర్ స్టేష‌న్‌లో ప‌డేసి పారిపోయాడు. సానిటేష‌న్ వ‌ర్క‌ర్లు శ‌వాన్ని చూసి పోలీసుల‌కు ఫిర్యాదు చేసారు. ప‌రారీలో ఉన్న సురేష్‌ను అరెస్ట్ చేసారు.