Titan Submarine: మృతుల్లో టైటానిక్ ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారి బంధువు!

US: టైటానిక్ (titan submarine) శ‌క‌లాల‌ను చూడటానికి స‌బ్‌మెరైన్‌లో వెళ్లి ప్రాణాలు కోల్పోయిన‌వారిలో.. 1912లో జ‌రిగిన టైటానిక్ (titanic) ప్ర‌మాదంలో చ‌నిపోయిన వారి బంధువు కూడా ఉన్నారు. అత‌ను ఎవ‌రో కాదు.. ఆ స‌బ్‌మెరైన్‌ని (titan submarine) త‌యరుచేసిన ఓష‌న్ గేట్ (ocean gate) సంస్థ సీఈఓ స్టాక్ట‌న్ ర‌ష్‌ (stockton rush). 1912లో జ‌రిగిన టైటానిక్ ప్ర‌మాదంలో ఇద్ద‌రు ఫ‌స్ట్‌క్లాస్ ప్యాసెంజ‌ర్లు చ‌నిపోయారు. వారిద్ద‌రూ భార్యాభ‌ర్త‌లు. మ‌రో ఇద్ద‌ర్ని కాపాడాల‌న్న ఉద్దేశంలో వారి వ‌ద్ద ఉన్న లైఫ్ జాకెట్స్ తీసి ఇచ్చేసారు. అలా ఆ భార్యాభ‌ర్త‌లు ఇద్దరూ మునిగి చ‌నిపోయారు. ఆ భార్యాభ‌ర్త‌ల‌కు బంధువైన వెండీ హోలింగ్స్ అనే యువ‌తిని.. సీఈఓ స్టాక్ట‌న్ ర‌ష్ పెళ్లి చేసుకున్నారు. అప్ప‌టినుంచి ఆయ‌న‌కు టైటానిక్ శ‌కలాల‌ను చూడాల‌నుకునేవారి కోసం మినీ స‌బ్‌మెరైన్‌ను నిర్మించాల‌న్న ఆలోచ‌న వ‌చ్చింది. కానీ అదే ఆలోచ‌న ఆయ‌న ప్రాణాల‌ను తీసేస్తుంద‌ని ఎవ‌రూ ఊహించ‌లేక‌పోయారు.