ఫోన్ కోసం డ్యాం ఖాళీ చేయించిన ఆఫీస‌ర్‌కి బిగ్ షాక్!

Chhattisgarh: ఇటీవ‌ల త‌న ఫోన్ కోసం డ్యాంలోని నీటిని వేస్ట్ చేయించిన (viral news) ప్ర‌భుత్వ అధికారికి ఛ‌త్తీస్‌ఘ‌డ్ (chattisgarh) ప్రభుత్వం షాకిచ్చింది. దాదాపు 20 ల‌క్ష‌ల నీటికి వేస్ట్ చేసినందుకు గానూ రూ.21 ల‌క్ష‌లు క‌ట్టాల‌ని ఆదేశించింది. కొన్ని రోజుల క్రితం.. కోయ‌ళిబెడ‌కు చెందిన రాజేష్ విశ్వాస్ అనే ఫుడ్ ఇన్‌స్పెక్ట‌ర్‌ స‌ర‌దాగా కేర్‌ఖ‌ట్టా ప‌ర‌ల్‌కోట్ డ్యాంకు వెళ్లాడు. అక్క‌డి డ్యాం అందాల‌ను చూస్తుండ‌గా త‌న చేతిలో ఉన్న ఫోన్ ప‌డిపోయింది. ఆ ఫోన్ విలువ రూ.90,000. ఇది కాక‌పోతే అత‌ను మ‌రో ఫోన్ కొనుక్కునే స్థోమ‌త ఉంది. కానీ రాజేష్ అలా చేయ‌కుండా త‌న‌కు త‌న ఫోన్ కావాల‌ని మొండిప‌ట్టు ప‌ట్టాడు. డ్యాం నుంచి ఫోన్ వెతికి తీయించ‌డానికి ఇరిగేష‌న్ డిపార్ట్‌మెంట్ అధికారుల‌తో మాట్లాడాడు.

ఆ డ్యాం లోతు 15 అడుగులు ఉంటుంది. చుట్టుప‌క్క‌ల ఉన్న 1500 ఎక‌రాల‌కు ఈ డ్యాం నుంచి నీరు వెళ్తుంది. ఇవేమీ ఆలోచించ‌కుండా అధికారుల ద్వారా ఏకంగా 30 హార్స్ పవ‌ర్ ఉన్న పంపు ద్వారా డ్యాంలో నీటిని ఖాళీ చేయించాడు. దాంతో ఒక చిన్న ఫోన్ కోసం ఒక్క రోజులో 20 ల‌క్ష‌ల లీట‌ర్ల నీరు వృధాగా పోయాయి. అయితే అత‌ని ఫోన్ మాత్రం మూడు రోజుల త‌ర్వాత దొరికింది. ఇంతా చేస్తే ఆ ఫోన్ 3 రోజులు నీళ్ల‌లో నానిపోవ‌డంతో ప‌నిచేయ‌లేదు. కానీ డ్యాంలో నీరు మాత్రం 10 అడుగుల వ‌ర‌కు త‌గ్గిపోయాయి. ఫోన్ నీళ్ల‌లో ప‌డిపోతే ప‌నిచేయ‌ద‌ని తెలిసి కూడా అన‌వ‌స‌రంగా నీటిని వృధా చేయించినందుకు స్థానికులు మండిప‌డుతున్నారు. దాంతో ఈ విష‌యం కాస్తా ప్ర‌భుత్వం దాకా వెళ్ల‌డంతో నీటికి వేస్ట్ చేసినందుకు గానూ రూ.21 ల‌క్ష‌లు చెల్లించాల‌ని ఆదేశాలు జారీ చేసింది.