Odisha Train Accident: మాటలకందని విషాదం..!
Odisha: ఒడిశాలో (odisha) దారుణం చోటుచేసుకుంది. బాలేశ్వర్ జిల్లాలో శుక్రవారం రాత్రి ఘోర రైలు ప్రమాదం (odisha goods train accident) చోటుచేసుకుంది. బెంగళూరు నుంచి హౌరా వెళ్తున్న సూపర్ ఫాస్ట్ ఎక్స్‌ప్రెస్ (super fast express), షాలిమార్ చెన్నై కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ రైలు (shalimar chennai coramandel express), ఒక గూడ్స్ రైలును ఢీకొన్నాయి. ఈ ఘటనలో 230 మంది పైగా మృతిచెందగా.. 900 మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు. అందులో చాలా మంది పరిస్థితి విషమంగా ఉంది. పరిస్థితి తెలుసుకుని రక్తదానం చేయడానికి హాస్పిటల్స్‌లో ప్రజలు లైన్ కట్టారు. రైలు ప్రమాదం చోటు చేసుకున్న ప్రదేశంలో సహాయక చర్యల కోసం హెలికాప్టర్లను దించారు. ఏపీ ప్రయాణికులు ఉన్నారని తెలుసుకుని వారి గురించి ఏపీ సీఎం జగన్ అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వివిధ రాష్ట్ర ముఖ్యమంత్రులు కూడా పరిస్థితులను సమీక్షిస్తున్నారు. ఇక ఈ ప్రమాదం ఎలా జరిగింది అన్నదానిపై ఉన్నత స్థాయిలో విచారణ చేపడతామని రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ తెలిపారు. ప్రమాదం ఎలా జరిగింది అనే విషయంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని పేర్కొన్నారు. ఇప్పటివరకు దూర ప్రాంతాలకు ప్రయాణించే 18 రైళ్లను నిలిపివేసారు. ఒడిశా ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ఈ బాధాకర ఘటనకు చింతిస్తూ ఒక రోజు హాలిడేని ప్రకటించారు.