Odisha: బస్సులో జంట పాడుపని..!
Odisha: ఒక దిక్కుమాలిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. బస్సులో ఓ జంట రొమాన్స్ చేసుకుంటూ ముద్దులు పెట్టుకుంటూ ఇతర ప్రయాణికులను అసౌకర్యానికి గురి చేసారు. ఈ ఘటన ఒడిశాలో చోటుచేసుకుంది. రూర్కెలా ప్రాంతంలో ప్రయాణిస్తున్న బస్సులో ఓ అమ్మాయి, అబ్బాయి ఇలా అసభ్యకరంగా ప్రవర్తిస్తూ ఇతర ప్రయాణికులకు అసౌకర్యం కలిగించారు. ఓ ప్రయాణికుడు వీరి నీతిమాలిన చర్యను వీడియో తీసి పోలీసులకు ట్యాగ్ చేసారు. అయితే ఇదే వీడియోను ఇతర నెటిజన్లు షేర్ చేస్తూ ఇది ఢిల్లీలో జరిగిందని అంటున్నారు. ఏ బస్సులో జరిగిందో ఆ బస్సు సంఖ్య ద్వారా వారిని అదుపులోకి తీసుకుని కఠిన చర్యలు తీసుకోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు.