Titan Submarine: 5 మందిని పొట్టనబెట్టుకుని.. మళ్లీ టైటానిక్ చూపిస్తారా?
America: టైటానిక్ శకాలాలను (titan submarine) చూడాలని ఆరాటపడిన ఐదుగురు వ్యక్తులు దుర్మరణం చెందిన ఘటన ఇంకా మర్చిపోకముందే ఇంకో ప్రకటన చేసింది ఓషన్ గేట్ (ocean gate) సంస్థ. అమెరికాకు చెందిన ఓషన్ గేట్ సంస్థ ఓ మినీ సబ్‌మెరైన్‌ను తయారుచేసింది. దీనికి స్టాక్టన్ రష్ (stockton rush) అనే వ్యక్తి సీఈఓగా వ్యవహరించాడు. పది రోజుల క్రితం జరిగిన ప్రమాదంలో స్టాక్టన్ రష్ కూడా మరణించాడు. ఆయన చనిపోయిన వారానికే ఓషన్ గేట్ మరో సీఈఓ కావాలంటూ ప్రకటన చేసింది. ఇప్పుడైతే ఏకంగా టైటానిక్ (titanic) శకలాలను చూడాలనుకునే అతి కొద్ది మందిలో మీరూ భాగం అవుతారా? అంటూ మరో ట్రిప్ అనౌన్స్‌మెంట్ ఇచ్చింది.
ఇప్పుడు ఈ ట్రిప్ వివరాలను ఓ వెబ్‌సైట్‌లో పోస్ట్ చేసారు. 2024లో జూన్ 12 నుంచి జూన్ 29 వరకు ట్రిప్‌లో పాల్గొనాలనుకునేవారు రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చు. ఒకొక్కరికి అయ్యే ఖర్చు $250,000 (దాదాపు 20 లక్షల పైమాటే). అయినా ఐదుగురి ప్రాణాలు పోయాక కూడా మళ్లీ ట్రిప్ అనౌన్స్‌మెంట్ చేసిన ఓషన్ గేట్ సంస్థకు ఇంతటి కాన్ఫిడెన్స్ ఏంటో అర్థం కావడంలేదు. కనీసం ఈసారైనా సబ్‌మెరైన్ పూర్తిగా మునిగినప్పటికీ అందరూ సురక్షితంగా బయటపడేలా జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. అయినా అట్లాంటిక్ మహాసముద్రంలో ఎక్కడో 12వేల మీటర్ల లోతులో ఉన్న టైటానిక్ శకలాలను చూడాలని ఎవరికైనా ఎందుకు అనిపిస్తుందో ఏంటో. అంతగా కావాలంటే డాక్యుమెంటరీలే చూసుకోవచ్చు కదా..!