NTV: CM ఆఫీస్‌లో కొట్టుకున్న TV9, NTV జర్నలిస్ట్‌లు!
AP: ఏపీ సీఎం ఆఫీస్‌లో రచ్చ జరిగింది. న్యూస్ కవరేజ్‌కి వెళ్లిన టీవీ 9, NTV లేడీ జర్నలిస్ట్‌ల మధ్య గొడవ జరిగింది. దాంతో ఇద్దరూ జుట్టుపట్టుకుని మరీ కొట్టుకోవడం చర్చనీయాంశంగా మారింది. బార్క్ (BARC) రేటింగ్స్ విషయంలో NTV టాప్ పొజిషన్‌లో ఉంది. ఇదే విషయమై ఇద్దరి మధ్య గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఏపీ సీఎం ఆఫీస్‌లో కొన్ని క్యాబిన్లు ఏర్పాటుచేసారు. ఒక క్యాబిన్‌లో టీవీ 9కు చెందిన హసీనా, మరో క్యాబిన్‌లో ఎన్టీవీకి చెందిన రెహానా పనిచేస్తున్నారు. హసీనా.. రెహానా క్యాబిన్‌లోకి వెళ్లి గొడవపెట్టుకున్నట్లు తెలుస్తోంది. వారిద్దరూ కొట్టుకుంటున్న సమయంలో సజ్జల రామకృష్ణా రెడ్డి (sajjala ramakrishna reddy) పేరు వినిపించింది. హసీనా, రెహానా కలిసే YSRCP ప్రభుత్వానికి పనిచేస్తున్నారని సజ్జల ప్రచారం చేస్తున్నారట. ఈ గొడవ తర్వాత వారిద్దరినీ ఆఫీస్ నుంచి పంపించేసారు.