అమెరికా కారుకి.. క‌ర్ణాట‌క నెంబ‌ర్ ప్లేట్!

Hyderabad: అమెరికాలో(america) కొన్న కారుకి క‌ర్ణాట‌క(karnataka) నెంబ‌ర్ ప్లేట్ ఉండ‌టం ఏంటి అనుకుంటున్నారా? ఈ క‌థ తెలియాలంటే.. పై ఫొటోలో కనిపిస్తున్న కుర్రాడి గురించి చెప్పాలి. ఇత‌ని పేరు ధ‌న‌పాల్ మంచెన‌హ‌ళ్లి. బెంగ‌ళూరుకి చెందిన ధ‌న‌పాల్.. KA01F232 అనే నెంబ‌ర్ ప్లేట్ ఉన్న బ‌స్సులో రోజూ స్కూల్‌కి వెళ్లేవాడు. ఆ త‌ర్వాత పై చ‌దువులు చ‌దివి అమెరికాలో సెటిల్ అయ్యాడు. ఇటీవ‌ల టెస్లా కారు కూడా కొన్నాడు. అయితే కారుకి త‌ను చిన్న‌ప్పుడు ట్రావెల్ చేసిన బ‌స్సు రిజిస్ట్రేష‌న్ నెంబ‌ర్ KA01F232 నే త‌న కారుకి పెట్టించుకున్నాడు.

చిన్న‌ప్పుడు త‌ను స్కూల్‌కి వెళ్లే బ‌స్సు ఎన్నో జ్నాప‌కాల‌ను ఇచ్చిందని, బస్సు డ్రైవ‌ర్ త‌న‌కు మంచి ఫ్రెండ్ అని ధ‌న‌పాల్ తెలిపాడు. డ్రైవ‌ర్ గుర్తుగా త‌న కారుకు ఆ నెంబ‌ర్ ప్లేట్ వేయించుకున్నాన‌ని అన్నాడు. ఇత‌ని స్టోరీ సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతుండ‌డంతో.. గొప్ప చ‌దువులు చదివి అమెరికాకు వెళ్లినా మూలాల‌ను, బంధాల‌ను మ‌ర‌వ‌లేదంటూ నెటిజ‌న్లు ధ‌న‌పాల్‌కి ఫిదా అయిపోయారు.