Aadhaar Card: ఇక దీనికి ఆధార్ పనికిరాదు..!
Aadhaar Card: ఎంప్లాయీస్ ప్రొవిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ (EPFO) ఆధార్ కార్డు వినియోగాన్ని తొలగించేసింది. పుట్టిన తేదీని ధృవీకరించడానికి (EPFO) ఆధార్ కార్డు డాక్యుమెంట్ సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. కానీ ఇప్పుడు ఆ ఆప్షన్‌ను తీసేసింది. తీసుకున్న నిర్ణయాన్ని సెంట్రల్ ప్రొవిడెంట్ ఫండ్ కమిషనర్ (CPFC) కూడా ఆమోదం తెలిపారు. 2016 ఆధార్ యాక్ట్ ప్రకారం.. పుట్టినతేదీని ధృవీకరించడానికి ఆధార్ ఏమాత్రం సరిపోదని తెలిపారు. కేవలం వినియోగదారుడి గుర్తింపు కోసం మాత్రమే ఆధార్ అవసరం అవుతుంది కానీ పుట్టినతేదీని ధృవీకరించేందుకు కాదని పేర్కొన్నారు. మరి ఆధార్ కార్డుకు బదులు ఏ డాక్యుమెంట్ సబ్మిట్ చేయాలి అనేదానిపై త్వరలో స్పష్టత ఇవ్వనున్నారు.