Aadhaar Card వివ‌రాలు ఫ్రీగా మార్చుకోండి..!

Hyderabad: మీ ఆధార్ కార్డులో (aadhaar card) ఏవైనా మార్పులు చేసుకోవాలంటే ఇక ఉచితంగా చేసుకోవ‌చ్చు. అది కూడా జూన్ 14 వ‌రకే ఈ బంప‌ర్ ఆఫ‌ర్‌ను ప్ర‌క‌టించింది UIDAI. ఆధార్ కార్డులో (aadhaar card) మార్పులు చేయ‌డానికి మీ సేవ సెంటర్లు రుసుం తీసుకుంటాయి. అలా కాకుండా ఉచితంగా మార్చుకోవాలంటే ఇదే మంచి ఛాన్స్. అయితే ఈ ఫ్రీ స‌ర్వీస్ ఆధార్ పోర్ట‌ల్‌లో మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. అదే మీరు మీ సేవ సెంట‌ర్ల‌కు వెళితే మాత్రం రూ.50 చెల్లించాల్సిందే. ఆధార్ కార్డు వ‌చ్చి 10 ఏళ్లు కావొస్తున్నా ఇప్ప‌టికీ డెమోగ్రాఫిక్ వివ‌రాలు అప్డేట్ చేసుకోలేని వారికి ఇది చక్క‌టి అవ‌కాశం. దీని ద్వారా ఆధార్ పోర్ట‌ల్‌లో (PoI/PoA) డాక్యుమెంట్లు అంటే.. ఐడెంటిటీ ప్రూఫ్‌, అడ్రెస్ ప్రూఫ్ డాక్యుమెంట్లు ఎటాచ్ చేయాల‌న్న‌మాట‌. ఈ ఫ్రీ స‌ర్వీస్‌ని వాడుకునేందుకు https://myaadhaar.uidai.gov.in/ పోర్ట‌ల్‌లోకి లాగిన్ అవ్వండి.

proceed to update address ఆప్ష‌న్ మీద క్లిక్ చేయండి. మీ రిజిస్ట‌ర్డ్ మొబైల్ నెంబ‌ర్‌కు OTP వ‌స్తుంది. ఆ త‌ర్వాత Document Update పై క్లిక్ చేయ‌గానే మీ వివ‌రాలు అన్నీ అక్క‌డే క‌నిపిస్తాయి. ఒక‌సారి అన్నీ స‌రిచూసుకోండి. అన్నీ ఓకే అనుకుంటే ఆ త‌ర్వాతి హైప‌ర్‌లింక్‌పై క్లిక్ చేయండి. ఆ త‌ర్వాతి స్క్రీన్‌లో ఐడెంటిటీ ప్రూఫ్‌, అడ్రెస్ ప్రూఫ్ అప్డేట్ చేయాల‌ని ఉంటుంది. అందులో మీ డాక్యుమెంట్లు అప్‌లోడ్ చేసేయండి. స‌బ్మిట్ చేసాక URN (అప్డేట్ రిక్వెస్ట్ నెంబ‌ర్) వ‌స్తుంది. 24 గంట‌ల త‌ర్వాత ఈ URN నెంబ‌ర్ ద్వారా ఆధార్ కార్డు అప్డేట్ అయ్యందో లేదో చూసుకోండి. అప్డేట్ అయ్యాక ఆ కాపీని డౌన్లోడ్ చేసుకోండి. ఒక‌వేళ అప్‌డేట్ అవ్వ‌క‌పోతే ద‌గ్గ‌ర్లోని మీ సేవ సెంట‌ర్ల‌కు వెళ్లండి.