Iphone 14: స‌గం ధ‌ర‌కే ఐఫోన్ మీ సొంతం!

Hyderabad: యాపిల్ ఐఫోన్ 15(iphone 15) మార్కెట్‌లోకి త్వ‌ర‌లో రాబోతోంది. ఈ నేప‌థ్యంలో ఐఫోన్ 14(iphone 14) మోడ‌ల్‌కు త‌క్కువ ధ‌ర‌కే విక్ర‌యిస్తోంది. ప్ర‌స్తుతం మార్కెట్‌లో ఐఫోన్ 14 ధ‌ర 80,000 ఉంది. దీనిని స‌గానికి త‌గ్గించి 40,000కే పొందాల‌ని అనుకుంటున్నారా? అయితే ఈ ఆఫ‌ర్ మీకోస‌మే. ప్ర‌ముఖ ఈకామ‌ర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో ఈ ఆఫ‌ర్ ఉంది. ఐఫోన్ 14 స‌గం ధ‌ర‌కే పొందాల‌ని అనుకుంటే ఈ స్టెప్స్ ఫాలో అయిపోండి.

ఇత‌ర బ్యాంక్ క్రెడిట్, డెబిట్ కార్డుల ఆఫర్ల‌పై ఫ్లిప్‌కార్ట్(flipkart) రూ.9000 వ‌ర‌కు ఇన్‌స్టంట్ డిస్కౌంట్ ఇస్తోంది. దీనితో పాటు మీ పాత మొబైల్‌ను ఎక్స్‌చేంజ్ చేస్కోవ‌చ్చు. కాక‌పోతే.. మీరు ఎక్స్‌చేంజ్ చేయాల‌నుకుంటున్న ఫోన్ వ‌ర్కింగ్ కండీష‌న్‌లో ఉండాలి, దానిపై ఎలాంటి ప‌గుళ్లు ఉండ‌కూడ‌దు. మీ పాత ఫోన్ బ్రాండ్, మోడ‌ల్, లాంచ్ అయిన తేదీని బ‌ట్టి ఫ్లిప్‌కార్ట్ ఎంత త‌గ్గించి ఇవ్వాలో నిర్ణ‌యిస్తుంది. కొన్ని పాత స్మార్ట్‌ఫోన్ల ఎక్స్‌చేంజ్‌పై ఫ్లిప్‌కార్ట్ అద‌నంగా రూ.3000 డిస్కౌంట్ ఇస్తోంది. అంటే.. ఎక్స్‌చేంజ్ ఆఫ‌ర్లో ఫ్లిప్‌కార్ట్ పేర్కొన్న ఫోన్ల‌లో మీ ఫోన్ ఉంటే ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్‌తో పాటు అద‌నంగా రూ.3000 డిస్కౌంట్ ఇస్తుంద‌న్న‌మాట‌.

6.1 అంగుళాల సూప‌ర్ ఎటీనా ఎక్స్‌డీఆర్ డిస్‌ప్లే ఉన్న ఐఫోన్ 14లో 12 ఎంపీ మెయిన్ కెమెరా, 12 ఎంపీ అల్ట్రా వైడ్ కెమెరా ఫీచ‌ర్లు ఉన్నాయి. వాట‌ర్, డ‌స్ట్ రెసిస్టెంట్ ఫీచ‌ర్లు కూడా ఉన్నాయి.