Naked Man Festival: 1250 ఏళ్ల తర్వాత.. మహిళలు అర్థనగ్నంగా..!
Naked Man Festival: పురుషులు కేవలం లోదుస్తుల్లో వచ్చి ఓ వ్యక్తిని ముట్టుకుని వెళ్లిపోతుంటారు. ఇది వారికి ఆచారం అట. ఈ పండుగను జపాన్‌లోని (japan) ఐచీ అనే ప్రాంతంలో జరుపుకుంటారు. ఈ పండుగ పేరు హడాకా మట్సూరి (hadaka matsuri). ఈ వేడుకలో అందరూ అర్థనగ్నంగా పాల్గొంటారు కాబట్టి నేకెడ్ మ్యాన్ ఫెస్టివల్ అంటారు. ప్రతి ఏటా ఘనంగా జరిగే ఈ వేడుక కోవిడ్ కారణంగా గత మూడేళ్లలో జరగలేదు. ఈసారి ఫిబ్రవరిలో బ్రహ్మాండంగా జరగబోతోంది. అయితే ఈసారి షాకింగ్ అంశం ఏంటంటే.. ఇప్పుడు మహిళలకు కూడా ఎంట్రీ ఉంది.
అసలు ఏంటీ వేడుక?
ఓ వ్యక్తి కొన్ని రోజుల పాటు ఒంటరిగా ఉంటూ తపస్సు చేసుకుంటాడు. ఆ తర్వాత తల నుంచి పాదాల వరకు శుభ్రంగా షేవ్ చేసుకుని వేడుక సమయానికి అందరికీ అర్థ నగ్నంగా దర్శనమిస్తాడు. ఆ సమయంలో ఇతర పురుషులు అతన్ని ముట్టుకుంటారు. ఇలా చేస్తే వారి బ్యాడ్ లక్ అతనికి అతని గుడ్ లక్ వారికి వస్తుందని నమ్ముతారు. ఇందులో కేవలం పురుషులే పాల్గొంటున్నారు. 1250 ఏళ్ల క్రితం వరకు అమ్మాయిలు కూడా పాల్గొనేవారు. ఆ తర్వాత అమ్మాయిలను ఈ వేడుకకు దూరంగా ఉంచారు. మళ్లీ 2024లో ఆడవారికి ఈ వేడుకలో పాల్గొనే అవకాశం వచ్చినందుకు జపాన్ వాసులు హర్షిస్తున్నారు.