Twitter: ఇక ఎవ్వ‌రినీ బ్లాక్ చేయ‌లేం..!

పిల్లాడి చేతికి బొమ్మ దొరికితే ఇష్టం వ‌చ్చిన‌ట్లు ఆడిన‌ట్లు.. ఎలాన్ మ‌స్క్ (elon musk) చేతికి ట్విట‌ర్ (twitter) దొర‌క‌గానే అలాగే ఆడేస్తున్నాడు. ఇప్ప‌టికే ట్విట‌ర్ ప‌క్షిని ఆ పేరుని తీసేసిన మ‌స్క్ దానికి X అని నామ‌క‌రణం చేసాడు. ఆ త‌ర్వాత ట్విట‌ర్ (twitter) వాడ‌కంలో ప‌లు మార్పులు చేర్పులు చేసాడు. అయితే ఇప్పుడు మస్క్ ఒక కొత్త ఫీచ‌ర్ తీసుకొచ్చాడు. ఇక ట్విట‌ర్‌లో ఎవ్వ‌రినీ బ్లాక్ (no blocking on twitter) చేయ‌డానికి వీలు ప‌డ‌దు.

ఆ ఆప్షన్ అస‌లు ఎందుకూ ప‌నికిరానిద‌ని, అందుకే బ్లాకింగ్ ఆప్ష‌న్ తీసేస్తున్నాన‌ని మ‌స్క్ ప్ర‌క‌టించాడు. అయితే.. ప‌ర్స‌న‌ల్ మెసేజెస్ చేసే వారి ఖాతాల‌ను బ్లాక్ చేసే స‌దుపాయం మాత్రం ఉంది. ఇప్ప‌టికే ట్విట‌ర్‌లో వ‌స్తున్న కామెంట్స్, ట్రోలింగ్స్ భ‌రించ‌లేక చాలా మంది సెల‌బ్రిటీలు కొన్ని వంద‌ల ఖాతాల‌ను బ్లాక్ చేసేసారు. ఇప్పుడు అవ‌న్నీ అన్‌బ్లాక్ అయిపోతాయి. ఇక ట్రోలింగ్ ఆప‌డం ఎవ‌రి త‌రం కాదు. చివ‌రికి సెల‌బ్రిటీలు ఖాతాలను తొల‌గించే ప‌రిస్థితి వ‌స్తుందేమో..! (twitter)