Water: ఇక మార్కెట్‌లోకి గాలి వెలుతురుతో తయారుచేసిన మంచి నీళ్లు…!
Water: మనకి మామూలుగా ఇప్పుడు తాగేందుకు లభిస్తున్న నీళ్లు భూగర్భ జలాల నుంచి వస్తున్నాయి. వాటినే ప్యాకేజ్డ్ వాటర్, మినరల్ వాటర్‌గా అమ్ముతుంటారు. కానీ భవిష్యత్తులో గాలి, సూర్య కిరణాల నుంచి వెలువడే వెలుతురు నుంచి తయారుచేసిన నీళ్లు అందుబాటులోకి రాబోతోంది. అరిజోనాకు చెందిన సోర్స్ అనే కంపెనీ ఈ నీటిని తయారుచేయబోతోంది. ఈ నీటిని SKY WTR అంటారు.
ఈ నీటిని తయారుచేసేందుకు హైడ్రోప్యానెల్ టెక్నాలజీని ఉపయోగిస్తారు. ఈ హైడ్రోప్యానెల్స్ సోలార్ ప్యానెల్స్‌లా పనిచేస్తాయి. అయితే ఈ సోలార్ ప్యానెల్స్ విద్యుత్‌కి బదులు నీటిని పుట్టిస్తాయి. వీటిలో ఉండే ఫ్యాన్లు తేమను రిలీజ్ చేస్తూ దానిని నీటిగా మారుస్తుంది. ఒక్కో హైడ్రోప్యానెల్ దాదాపు 3 లీటర్ల శుద్ధమైన, మినరల్ వాటర్‌ను తయారుచేస్తుంది. ఒక్కసారి ఇవి మార్కెట్‌లోకి వచ్చాయంటే ఇక ఇళ్లు, పాఠశాలలు, హోటళ్లలో ఏర్పాటు చేసుకోవచ్చు. ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఉన్న వాటర్ ఇండస్ట్రీ దాదాపు 350 బిలియన్ డాలర్ల విలువైన భూగర్భ జలాలపై ఆధారపడి ఉంది.
2035 నాటికి తాజా నీటి డిమాండ్ 40 శాతం పెరగనుంది. ఈ SKY WTR గాలి ద్వారా నీటిని తయారుచేస్తుంది కాబట్టి భూగర్భ జలాలను పీల్చి పిప్పి చేసే అవకాశం రాదు. అయితే ఈ SKY WTR ఇప్పుడు చాలా ఖరీదు. ఒక్కో SKY WTR క్యాన్ దాదాపు 3000 డాలర్లు. భవిష్యత్తులో ధరలు తగ్గి సామాన్యలు కూడా తాగేలా అందుబాటులోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.