WFI: అనుకున్నది ఒకటి అయినదొకటి..ఈ ముగ్గురికి వ్యతిరేకంగా రెజ్లర్లు
WFI: అనుకున్నది ఒకటి అయినది ఒకటి అనే సామెత ఈ రెజ్లర్లకు బాగా సూట్ అవుతుంది. రెజ్లర్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా మాజీ చీఫ్ బ్రిజ్ భూషణ్ షరన్ సింగ్ తమను లైంగికంగా వేధించాడంటూ దాదాపు ఏడాది నుంచి రెజ్లర్లు ధర్నాలు చేపడుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో రెజర్ల్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా నుంచి జరగాల్సిన పోటీలు, కాంపిటీషన్లు ఆగిపోయాయి. దాంతో ఇతర రెజ్లర్లకు కెరీర్ లేకుండాపోతోంది.
దాంతో వందలాది మంది రెజ్లర్లు బస్సులు, బండ్లు వేసుకుని ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద టాప్ రెజ్లర్లు అయిన భజరంగ్ పూనియా, సాక్షి మాలిక్, వినేష్ ఫోగాట్‌లకు వ్యతిరేకంగా నిరసనలు చేసారు. ఈ ముగ్గురి వల్ల జరగాల్సిన టోర్నమెంట్లు, పోటీలు ఆగిపోయాయని.. వీరి వల్ల తమ కెరీర్ నాశనమవుతోందని ఆవేదన వ్యక్తం చేసారు. గతేడాది ఇదే జంతర్ మంతర్ వద్ద ఈ ముగ్గురూ కలిసి బ్రిజ్ భూషణ్‌కు వ్యతిరేకంగా ధర్నా చేపట్టారు. ఇప్పుడు అటు తిరిగి ఇటు తిరిగి ఆ సెగ వీరికే తగిలింది.