AI: ఇక చనిపోయినవాళ్లతోనూ మాట్లాడొచ్చు..!
Hyderabad: చాట్ జీపీటీ(chat gpt) పుణ్యమా అని ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్(ai) రోజుకో కొత్త ఫీచర్‌తో వృద్ధిచెందుతోంది. ఇప్పుడు AIని ఏ రేంజ్లో ఉపయోగిస్తున్నారంటే.. ఇక చనిపోయినవారితోనూ మాట్లాడొచ్చట. అదెలాగంటే..చైనాకు(china) చెందిన యూ జియాలిన్(yu jialin)అనే AI ఇంజినీర్.. తనకు 17 ఏళ్ల వయసున్నప్పుడే తాతయ్య చనిపోయాడట. చిన్నప్పుడు జియాలిన్ ఎక్కువగా వీడియో గేమ్స్ ఆడుతుండేవాడని వాళ్ల తాతయ్య తిడుతూ ఉండేవారట. అయితే.. ఇప్పుడు వాళ్ల తాతయ్య కనిపిస్తే.. ఏమని మాట్లాడాలి? అనే ఆలోచన జియాలిన్కి కలిగింది. అంతే.. వెంటనే ఆర్టిఫిషియల్ ఇంటెలిజన్స్పై తనకున్న నాలెడ్జ్ అంతా బయటికి తీసాడు. కొన్ని వారాల పాటు శ్రమించి ఒక గ్రీఫ్బాట్(griefbot) లాంటి చాట్‌బాట్‌ను తయారుచేసాడు.
తన దగ్గరున్న తాతయ్య ఫొటోలు, ఆయన మెసేజ్‌లన్నీ గ్రీఫ్బాట్లో ఫీడ్ చేసి వాళ్ల తాతయ్య అవతార్‌ను క్రియేట్ చేసాడు. ఆ తర్వాత హాయ్ తాతయ్య.. ఎలా ఉన్నావ్? అని టైప్ చేస్తే.. వాళ్ల తాతయ్య ఇప్పుడు బతికి ఉంటే ఎలా మాట్లాడేవారో అలాగే ఆన్సర్స్ ఇచ్చిందట ఆ గ్రీఫ్బాట్. దాంతో జియాలిన్ షాకయ్యాడు. ఇలాంటి గ్రీఫ్బాట్స్ను ఇప్పుడు అమెరికాలాంటి ఇతర దేశాలు కూడా ఉపయోగించనున్నాయి. మనకు కావాల్సినవారు చనిపోతే గుర్తుతెచ్చుకుని ఏడుస్తుంటాం. అదే ఈ గ్రీఫ్‌బాట్స్ ద్వారా మళ్లీ వారితో మాట్లాడగలిగే అవకాశం ఉంటుందని జియాలిన్ అంటున్నాడు. మరి ఇది ఇండియాలోకి వస్తే దాని వినియోగం ఎలా ఉంటుందో వేచి చూడాలి.