High Court: ఇక వైద్యులు క్యాపిటల్ లెటర్స్‌లోనే రాయాలి!
High Court: వైద్యులు రాసే ప్రిస్క్రిప్షన్ అర్థంచేసుకోవాలంటే సామాన్యుల వల్లైతే కాదు. వారి చేతి రాతలు తోటి వైద్యులు, మెడికల్ షాప్ వారికి తప్ప మరెవ్వరికీ అర్థంకాదు. వైద్యుల చేతి రాతలపై ఇప్పటికే ఎన్నో ఫన్నీ మీమ్స్ కూడా ఉన్నాయి. ఓ నివేదికలో వైద్యుల చేతి రాతలు అర్థంకాక ఒక ట్యాబ్లెట్‌కి బదులు ఇంకో ట్యాబ్లెట్ తీసుకోవడం వల్ల పేషెంట్లు కూడా చనిపోయిన దాఖలాలు ఉన్నాయని తేలింది. అయితే ఇక డాక్టర్లు ఎలా పడితే అలా రాయడానికి కుదరదని తేల్చి చెప్పేసింది ఒడిశా హైకోర్టు.
ఇంతకీ కోర్టు ఈ నిర్ణయం ఎందుకు తీసుకుందో తెలుసా.. ఓ కేసులో విచారణలో భాగంగా వైద్యులు రాసిన పోస్ట్ మార్టెం రిపోర్టు ఆధారంగా న్యాయమూర్తి తీర్పు చెప్పాల్సి ఉంది. అయితే న్యాయమూర్తికి డాక్టర్ రాసిన రిపోర్ట్ తలబాదుకున్నా అర్థంకాలేదు. దాంతో తీర్పు వెల్లడించడంలో చాలా ఆలస్యం అయింది. ఇలా అయితే కుదరదని.. ఇక నుంచి ఒడిశాలోని అందరు వైద్యులు ఏం రాసినా కూడా అందరికీ అర్థం అయ్యేలా క్యాపిటల్ లెటర్స్‌లోనే రాయాలని ఆదేశాలు జారీ చేసారు. అలా మన తెలుగు రాష్ట్రాల్లోనూ ఆదేశాలు ఇస్తే ఎంత బాగుండో కదా..!