AI: ఇక ఎప్పుడు చనిపోతామో కూడా చెప్పేస్తుందట!
ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI) రోజురోజుకీ ఎంత వృద్ధి చెందుతోందంటే.. ఒక మనిషి ఎప్పుడు చనిపోతాడో కూడా చెప్పే స్టేజ్‌కి వచ్చేసింది. దీనినే డెత్ కాలిక్యులేటర్ అంటారట. డెన్మార్క్‌లోని టెక్నికల్ యూనివర్సిటీ ఈ డెత్ కాలిక్యులేటర్‌ని తయారుచేసింది. లైఫ్ 2 వెక్ అనే ఆల్గరిథం వాడి ఈ డెత్ కాలిక్యులేటర్‌ను చాట్ జీపీటీ సాయంతో డిజైన్ చేసారు.
ఈ డెత్ కాలిక్యులేటర్‌లోకి వెళ్లి చేస్తున్న ఉద్యోగం, వస్తున్న జీతం, ఎక్కడ నివసిస్తారు, హెల్త్ బ్యాక్‌గ్రౌండ్‌కు సంబంధించిన వివరాలను నమోదు చేస్తే ఎప్పుడు చనిపోతామో చెప్పేస్తుందట. ఈ డెత్ కాలిక్యులేటర్ ఇస్తున్న ఫలితాలు 78% నిజమేనని తేలినట్లు కూడా డిజైన్ చేసినవారు చెప్తున్నారు. అంటే వారు ఇంకో ఏడాదిలో చనిపోయేవారితో దీనిపై ప్రయోగం చేసినట్లు తెలుస్తోంది.
అయితే ఈ డెత్ కాలిక్యులేటర్ అవసరం ఎవరికి ఉంటుంది? ఎవరికి కూడా ఎప్పుడు చనిపోతాం అని తెలుసుకోవాలని ఎందుకు ఉంటుంది? ఈ ప్రశ్నలకు వారు ఏమని సమాధానం చెప్తున్నారంటే.. ఎప్పుడు చనిపోతామో తెలిస్తే కుటుంబం కోసం బీమా తీసుకునే అవకాశం ఉంటుందని.. వీలునామాలు వంటివి కూడా ముందే రాసి పెట్టుకోవచ్చని ఈ టూల్‌ని వాడుతున్నవారు చెప్తున్నారు.