India: స్వదేశంలో ప్రేమ దొరకడంలేదా?
Hyderabad: ఎవరి దేశంలో వారికి ప్రేమ దొరకడంలేదేమో..! పక్క దేశాల వ్యక్తులపై మోజు పడి పారిపోతున్నారు. పెళ్లి కాని వారు ఇలాంటి పనులు చేస్తున్నారంటే అర్థంచేసుకోవచ్చు. కానీ పెళ్లై.. పిల్లలు ఉన్నవారు కూడా ఇలాంటి పనులు చేస్తే దేశం పరువు ఏమైపోవాలి? (india)
నెల రోజుల క్రితం పాకిస్థాన్‌కు చెందిన సీమా హైదర్ అనే మహిళ పబ్జీలో పరిచయం అయిన ఉత్తర్‌ప్రదేశ్‌లోని నోయిడా వ్యక్తి కోసం కట్టుకున్న భర్తన వదిలేసి తన నలుగురు పిల్లలతో కలిసి ఇండియాకు అక్రమంగా వచ్చేసింది. అసలే ఆ దేశం నుంచి ఇక్కడికి వచ్చినవారిపై నిఘా ఎక్కువగా ఉంటుంది. పోలీసులకు విషయం తెలిసి సీమాను, ఆమె ప్రేమించిన నోయిడా వ్యక్తి సచిన్‌ను అదుపులోకి తీసుకున్నారు. ఒక రెండు వారాల పాటు రిమాండ్‌లో ఉంచారు. ఆ తర్వాత వదిలేసారు. సీమా మాత్రం తాను ఇక్కడే ఉంటానని, భారత పౌరసత్వం కల్పించండి అని వేడుకుంటోంది. పాకిస్థాన్‌కు పంపించేస్తే అక్కడివారు కొట్టి చంపేస్తారని ఆ చావు ఇక్కడే చస్తానని అంటోంది. కానీ ఆమెపై ఉన్న అనుమానాలతో యాంటీ టెర్రర్ బృందం ఆమెపై ఓ కన్నేసి ఉంచింది. ఎలాగో అలా తిరిగి పాకిస్థాన్ పంపించే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. (india)
ఈ ఘటన జరిగిన నెల రోజులకే మన భారతీయ మహిళ పరాయి దేశంలో ప్రేమను వెతుక్కుంటూ వెళ్లిపోయింది. రాజస్థాన్‌కు చెందిన అంజు అనే 34 ఏళ్ల మహిళ ఫేస్‌బుక్‌లో పాకిస్థాన్ వ్యక్తిని పరిచయం చేసుకుంది. అతనిపై ప్రేమ పెంచుకుని.. కట్టుకున్న భర్త కళ్లుకప్పి, కన్నబిడ్డ గురించి కూడా ఆలోచించకుండా పాస్‌పోర్ట్, డాక్యుమెంట్లు రెడీ చేసుకుని పాకిస్థాన్ వెళ్లిపోయింది. పైగా తన భర్తను జైపూర్‌లో పని ఉంది అని చెప్పి వెళ్లిపోయిందట. పాకిస్థాన్ ఎయిర్‌పోర్ట్‌లో అంజుని అదుపులోకి తీసుకున్నారు. ఆమె దగ్గర ఉన్న డాక్యుమెంట్లన్నీ సరైనవే కావడంతో వదిలేసారు. అలా అంజూ తన ప్రేమను వెతుక్కుంటూ పాకిస్థాన్ వెళ్లిపోయింది. (india)