Vikas Mahante: డీప్‌ఫేక్ వీడియోలో ఉన్న‌ది మోదీ కాదు నేనే..!

డీప్‌ఫేక్ వీడియోలు (deepfake) ఎంత న‌ష్టం క‌లిగిస్తున్నాయో ఇటీవ‌ల ప్ర‌ధాని న‌రేంద్ర మోదీ (narendra modi) వివ‌రించారు. ప్ర‌ధాని అయిన త‌న‌ని కూడా వ‌ద‌ల్లేద‌ని తన‌ను గ‌ర్భా ఆడుతున్న‌ట్లు డీప్‌ఫేక్ వీడియోను క్రియేట్ చేసార‌ని తెలిపారు. ఇలాంటి వీడియోల‌ను షేర్ చేస్తే అవే నిజం అనుకునే ప్ర‌మాదం ఉంద‌ని మోదీ తెలిపారు. అయితే ఈ అంశంలో కొత్త ట్విస్ట్ వెలుగులోకి వ‌చ్చింది. గ‌ర్భా ఆడుతున్న వీడియో డీప్‌ఫేక్ కాద‌ని.. అందులో ఉన్న‌ది తానే అని వెల్ల‌డించారు వ్యాపార‌వేత్త వికాస్ మ‌హంతే (vikas mahante).

ముంబైకి చెందిన వికాస్ మ‌హంతే ఓ పెద్ద వ్యాపార‌వేత్త‌. మోదీ వేషంలో కొన్ని సినిమాలు కూడా చేసారు. ఏదైనా కార్య‌క్ర‌మానికి మోదీని ఆహ్వానించ‌డం అంత సులువు కాదు కాబ‌ట్టి మోదీ బ‌దులు అంతా వికాస్‌ను అతిథిగా ఆహ్వానిస్తుంటారు. తాను కేవ‌లం మోదీ పోలిక‌లతో మాత్ర‌మే ఉన్నాన‌ని.. అందుకే ఫేమ‌స్ అయ్యానే త‌ప్ప మోదీ స్థానాన్ని బ‌ర్తీ చేయాల‌ని మాత్రం అస్స‌లు చూడ‌టం లేద‌ని వికాస్ క్లారిటీ ఇచ్చారు.