Traffic Challan Discount: డిస్కౌంట్లు వారికి వర్తించవు!
Traffic Challan Discount: ఇటీవల తెలంగాణ ప్రభుత్వం పెండింగ్‌లో ఉన్న ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్ ప్రకటించిన సంగతి తెలిసిందే. అయితే ఈ డిస్కౌంట్లు చలానాలు బకాయిలో ఉన్నవారందరికీ వర్తించవు.
కేటగిరీల వారీగా డిస్కౌంట్లు
ద్విచక్ర వాహనదారులకు, ఆటో డ్రైవర్లకు తమ పెండింగ్ చలానా బకాయిల నుంచి 20 శాతం వరకు చెల్లిస్తే సరిపోతుంది. మిగతా 80 శాతం ప్రభుత్వం కట్టేస్తుంది.
తోపుడు బండ్ల వారికి తమ పెండింగ్ చలానాల్లో 10 శాతం వరకు కడితే సరిపోతుంది.
లైట్ మోటర్ బండ్లు, కార్లు, జీపులు, భారీ వాహహనదారులు 40 శాతం వరకు చెల్లిస్తే సరిపోతుంది.
ఆర్టీసీ డ్రైవర్లు పది శాతం వరకు చెల్లిస్తే సరిపోతుంది.
ఈ రూల్స్ గుర్తుపెట్టుకోవాలి
కేవలం నవంబర్ 30 లోపు బకాయిలు పడిన చాలానాలకు మాత్రమే ఈ డిస్కౌంట్లు వర్తిస్తాయట. ఈ విషయాన్ని హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు స్పష్టం చేసారు. ఓ నెటిజన్ తనకు పడిన చలానా మొత్తంలో డిస్కౌంట్ తర్వాత కూడా అదే మొత్తం చూపిస్తుండడంతో ట్వీట్ చేస్తూ హైదరాబాద్ పోలీస్‌ని ట్యాగ్ చేసారు. అతనికి చలానా డిసెంబర్‌లో పడిందని.. నవంబర్ 30 తర్వాత విధించిన చలానాలకు ఈ డిస్కౌంట్లు వర్తించవని పేర్కొన్నారు. 2024 జనవరి 10 వరకు ఈ ట్రాఫిక్ చలానాలపై డిస్కౌంట్లు వర్తించనున్నాయి.