Nizampet: అసలే వర్షాలు.. తవ్వి వదిలేస్తే ఎలా?
Hyderabad: పైన కనిపిస్తున్న ఫొటో చూసి కొన్ని రోజులుగా పడుతున్న వర్షాల కారణంగా రోడ్డు అలా బురదగా అయిపోయింది అనుకుంటే పొరపాటే. అక్కడ ఇంతకు ముందు ఒక మంచి రోడ్డు ఉండేది. కానీ కొన్ని వారాల క్రితం పైప్‌లైన్లు వేయాలంటూ ఇలా ఉన్న రోడ్డునంతా తవ్వేసారు. ఈ ఫొటో హైదరాబాద్ నిజామ్‌పేటలోని (nizampet) నాదమూరి నగర్‌లోది. ఎన్ని రోజులవుతున్నా పైప్‌లైన్లు వేయకుండా అలాగే వదిలేసారు. దాంతో ప్రజలు ఎటూ వెళ్లలేక ముప్పతిప్పలు పడుతున్నారు. అసలే వర్షాకాలం. పిల్లలు ఆడుకుంటూ నీరున్న గుంతల్లో పడిపోయినా ప్రమాదమే. ఇప్పటికైనా స్థానిక అధికారులు వెంటనే గుంతన్నీ పూడ్చి మళ్లీ రోడ్డేస్తే మంచిదని స్థానికులు రిక్వెస్ట్ చేస్తున్నారు.