Nirbhaya Mother: మమతా బెనర్జీ రాజీనామా చేయాల్సిందే
Nirbhaya Mother: వెస్ట్ బెంగాల్ రాజధాని కలకత్తలో జరిగిన వైద్యురాలి రేప్ కేసు దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. న్యాయం జరిగే వరకు ధర్నాలు ఆపమని డాక్టర్లు రోడెక్కారు. ఈ ఘటనపై నిర్భయ తల్లి ఆశా దేవి స్పందించారు. ఈ ఘోరానికి కారణం ముఖ్యమంత్రి మమతా బెనర్జీనే అని అన్నారు. ఒక ఆడది అయ్యుండి అందులోనూ ముఖ్యమంత్రి అయ్యుండి మరో ఆడపిల్లకు ఇంత ఘోరం జరిగితే అధికారంలో ఉండి కూడా ఏమీ చేయలేకపోవడమేంటి అని ప్రశ్నించారు. నిందితులను పట్టించాల్సిందిపోయి ప్రజలతో కలిసి ధర్నాల్లో పాల్గొనడమేంటో తనకు అర్థంకావడం లేదని అన్నారు. ఆమె ముఖ్యమంత్రి పదవికి అర్హురాలు కారని వెంటనే రాజీనామా చేయాలని అన్నారు.
2013లో ఢిల్లీలో నిర్భయ గ్యాంగ్‌రేప్‌కు గురై కొన్ని రోజుల పాటు మృత్యువుతో పోరాడి చనిపోయిన సంగతి తెలిసిందే. ఎన్నో ఏళ్ల పాటు పోరాటం చేస్తే కానీ నిర్భయ నిందితులకు ఉరి శిక్షలు పడలేదు.