Wrestlers Case: అప్పుడు నిర్భయ కోసం.. ఇప్పుడు ఇతని కోసమా?
Delhi: నిర్భయ (nirbhaya) ఘటనను నేటికీ ఎవ్వరూ మర్చిపోలేదు. దేశ రాజధాని దిల్లీలో జరిగిన ఈ ఘటన యావత్ భారత దేశాన్ని వణికించింది. ఆ ఘటన తర్వాతే నిర్భయ చట్టం అమల్లోకి వచ్చింది. అయితే నాడు నిర్భయ కేసులోని నిందితులకు ఉరిశిక్ష పడాలని పోరాడిన ఓ లాయర్.. నేడు ఆడపిల్లల (wrestlers case) పట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన వ్యక్తి కోసం కోర్టులో వాదించనున్నారట. రెజ్లర్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా (wfo) చీఫ్ బ్రిజ్ భూషణ్ శరణ్ సింగ్ (brij bhushan sharan singh) తమను లైంగికంగా వేధించారంటూ మహిళా రెజ్లర్లు ఆందోళన చేపట్టిన సంగతి తెలిసిందే. దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద పెద్ద ఎత్తున ధర్నా చేపట్టడంతో ఎట్టకేలకు నిందితుడు బ్రిజ్ భూషణ్‌పై కేసు నమోదు చేసారు. ఈ కేసును వాదించేది ప్రముఖ లాయర్ రాజీవ్ మోహన్ (rajiv mohan). రాజీవ్ మోహన్ గతంలో నిర్భయ (nirbhaya) కేసులోని నిందితులకు ఉరిశిక్ష పడాల్సిందేనని కోర్టులో వాదించారు. ఆనాడు ఓ ఆడపిల్లకు న్యాయం చేయాలని పోరాడిన రాజీవ్.. ఇప్పుడు అదే ఆడపిల్లలు బ్రిజ్ భూషణ్‌పై కేసు పెడితే ఇప్పుడు అతని తరఫున వాదించనున్నారు. దాంతో ఈ విషయం కాస్తా చర్చనీయాంశంగా మారింది.